యాప్నగరం

మహిళలకే ఉద్యోగాలంటూ.. బాస్ కామకేళి

ఇంజినీరింగ్ కంపెనీలో మహిళా ఉద్యోగినులతో కామకేళి నడిపిస్తున్న ఓ బాస్‌ గుట్టురట్టయ్యింది. విశాఖపట్నం జిల్లా

TNN 14 Dec 2017, 10:05 am
ఇంజినీరింగ్ కంపెనీలో మహిళా ఉద్యోగినులతో కామకేళి నడిపిస్తున్న ఓ బాస్‌ గుట్టురట్టయ్యింది. విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెంనకు చెందిన శ్రీనివాసరావు ద్వారకానగర్‌లో ఓ ఇంజినీరింగ్ సంస్థని గత కొంతకాలంగా నిర్వహిస్తున్నాడు. ఇందులో మహిళలకే ఎక్కువ ఉద్యోగ అవకాశాల్ని కల్పిస్తూ.. మాయమాటలతో వారిని లొంగదీసుకుని.. వారితో ఏకాంతంగా గడిపిన సమయంలో తీసుకున్న ఫొటోలు, వీడియోలను ఫ్రెండ్స్‌కి షేర్ చేసేవాడు.
Samayam Telugu boss romance with lady employees in visakhapatnam
మహిళలకే ఉద్యోగాలంటూ.. బాస్ కామకేళి


ఇలా ఓ ఉద్యోగినితో శ్రీనివాసరావు ఏకాంతంగా ఉన్న వీడియో ఇటీవల ఆ ఉద్యోగిని భర్తకి చేరడంతో హతాశుడైన ఆయన పోలీసులకి ఫిర్యాదు చేశాడు. ఉద్యోగినుల్లోనే ఒకరికి తెలియకుండా మరికొరిని లొంగదీసుకోవడం.. తర్వాత నిరాకరిస్తే ఫొటోలు, వీడియోలు చూపించి బెదిరించడం లాంటివి చేసేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కుటిల బుద్ధితోనే ఏరికోరి మరీ మహిళలకే సంస్థలో ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీనివాసరావుని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.