యాప్నగరం

అవయవదానంతో ఐదుగురికి ప్రాణం పోసింది

తోటి మనిషి కష్టంలో ఉన్నా సాయం చేయని రోజులివి. రోడ్డుపై ఎవరైనా ప్రమాదంలో ఉన్నా కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయే సమాజం మనది. అలాంటి చెడ్డవాళ్లు మనతో పాటూ ఉన్నట్లే మంచివాళ్లు కూడా మన ఉన్నారని కొన్ని సంఘటనలు తెలియజేస్తుంటాయి.

Samayam Telugu 3 Jun 2018, 11:23 am
తోటి మనిషి కష్టంలో ఉన్నా సాయం చేయని రోజులివి. రోడ్డుపై ఎవరైనా ప్రమాదంలో ఉన్నా కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయే సమాజం మనది. అలాంటి చెడ్డవాళ్లు మనతో పాటూ ఉన్నట్లే మంచివాళ్లు కూడా మన ఉన్నారని కొన్ని సంఘటనలు తెలియజేస్తుంటాయి. సరిగ్గా అలాగే.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. బ్రెయిన్ డెడ్ అయిన కూతురు ఎలాగూ బతకదని తెలిసిన తల్లిదండ్రులు.. ఆమె అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చి పెద్ద మనసును చాటుకున్నారు. ఐదుగురికి ప్రాణాలు పోసి.. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి శభాష్ అనిపించుకుంటున్నారు.
Samayam Telugu Mounika


నల్గొండ జిల్లా రామగిరికి చెందిన మౌనిక ఎస్‌ఆర్డీఎస్ ఇంజినీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతోంది. మే 28న రామగిరి దగ్గర రోడ్డు ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు.. మరుసటి రోజు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని మరో ఆస్పత్రిలో చేర్చారు. కాని మౌనిక బ్రెయిన్ డెడ్ అయ్యిందని డాక్టర్లు తేల్చారు. ఈ విషయం తెలుసుకున్న జీవన్‌దాన్ ప్రతినిధులు ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. అవయవదానం గొప్పతనం గురించి వివరించారు.

జీవన్‌దాన్ ప్రతినిధుల కౌన్సెలింగ్‌తో మౌనిక కుటుంబ సభ్యులు అవయవదానానికి ఒప్పుకున్నారు. డాక్టర్లు ఆమె కిడ్నీలు, కళ్లు, కాలేయంను వేరే ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న పేషెంట్లకు పంపించారు. మౌనిక తాను చనిపోతూనే.. మరో ఐదుగురికి ప్రాణదాతగా నిలిచింది. అలాగే అవయవదానానికి అంగీకరించిన వారి కుటుంబసభ్యుల్ని జీవన్‌దాన్ ప్రతినిధులు అభినందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.