యాప్నగరం

జగన్ నిర్ణయంపై వైసీపీ నేత గరం

ప్రకాశం జిల్లా పాదయాత్రలో వైసీపీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయం పార్టీలో చిచ్చు రేపింది. అధినేత నేరుగా పార్టీ అభ్యర్థిని ప్రకటించడంపై జిల్లా ముఖ్య నేత ఆగ్రహంతో ఉన్నారు. తన అభిప్రాయం తీసుకోకుండానే నిర్ణయం ఎలా ప్రకటిస్తారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట.

TNN 5 Mar 2018, 1:59 pm
ప్రకాశం జిల్లా పాదయాత్రలో వైసీపీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయం పార్టీలో చిచ్చు రేపింది. అధినేత నేరుగా పార్టీ అభ్యర్థిని ప్రకటించడంపై జిల్లా ముఖ్య నేత ఆగ్రహంతో ఉన్నారు. తన అభిప్రాయం తీసుకోకుండానే నిర్ణయం ఎలా ప్రకటిస్తారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. ఆయనెవరో కాదు జిల్లా ముఖ్య నేత, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. తనకు కనీసం ఒక్కమాట కూడా చెప్పకుండా దర్శి నియోజకవర్గ అభ్యర్థిగా మాధవరెడ్డిన ప్రకటించడాన్ని బూచేపల్లి తప్పుబడుతున్నారు. గతంలో తనకు, పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వ్యక్తిని ఎలా అందలమెక్కిస్తారని ఆగ్రహంతో ఉన్నారట.
Samayam Telugu buchepalli sivaprasad reddy angry on ys jagans decision
జగన్ నిర్ణయంపై వైసీపీ నేత గరం


గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన శివప్రసాద్ రెడ్డి ఓడిపోయారు. తర్వాత కొంతకాలం యాక్టివ్‌గా పనిచేసిన ఆయన... తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేనని కూడా ప్రకటించారు. అయితే అనూహ్యంగా జగన్ పాదయాత్రలో పాల్గొన్న ఆయన... మళ్లీ తెరపైకి వచ్చారు. అంతా మళ్లీ ఆయన రంగంలోకి దిగారని భావించారు. కాని ఎన్నికల్లో పోటీ చేయలేనని మళ్లీ జగన్‌తో చెప్పేశారు. బూచేపల్లి క్లారిటీ ఇవ్వడంతో... తాళ్లూరు బహిరంగ సభలో అభ్యర్థిగా మాధవరెడ్డిని ప్రకటించేశారు. అతడ్ని ఆశీర్వదించి, మద్దతు ఇవ్వాలని కోరారు.

ఈ నిర్ణయమే శివప్రసాద్ రెడ్డికి నచ్చలేదు. దీనిపై అసంతృప్తిగా ఉన్న ఆయన... ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షుడు బాలినేనితో భేటీ అయ్యారు. 2014 ఎన్నికల్లో మాధవ్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. తన ఓటమిలో అతని పాత్ర ఉందని బాలినేనితో చెప్పారట. తమ కుటుంబం మొత్తం జగన్ వెంట నడిచిందని... నాన్నకు ఆరోగ్యం సహకరించనందుకే కొద్ది రోజులు గడువు కోరారట. పార్టీ కోసం కలిసి పనిచేస్తామని... మంచి అభ్యర్థిని పెడదామని జగన్‌కు తాను చెప్పినట్లు బాలినేని దగ్గర ప్రస్తావించారని సమాచారం. గత ఎన్నికల్లో పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తికి ఎలా టిక్కెట్ ఇస్తారని చెప్పడం సరికాదని చెప్పారట. ఈ నిర్ణయం తనను బాధించిందని చెప్పగా... రెండు రోజుల్లో అంతా సర్థుకుంటుందని... జగన్‌తో మాట్లాడతానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక బూచేపల్లి అద్దంకిలో జగన్‌ను కలవకుండానే వెళ్లిపోయారు.

తర్వాత శివప్రసాద్ రెడ్డి తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో ముండ్లమూరులోని ఇటుకల బట్టీ దగ్గర సమావేశమయ్యారట. వారితో తన ఆవేదన వ్యక్తం చేశారట. పార్టీ కోసం నిజాయితీగా పనిచేస్తే... తమ కుటుంబానికి ఇచ్చే బహుమతి ఇదేనా అని వ్యాఖ్యానించారట. ఈ విషయంపై రెండు రోజుల్లో తేల్చుకుంటే భవిష్యత్ నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతేనన్నారట. మరి దర్శి ఎపిసోడ్‌ను జగన్ ఎలా డీల్ చేస్తారో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.