యాప్నగరం

భవన నిర్మాణ సేవలు ఆన్ లైన్లో - కేటీఆర్

హైదరాబాద్: భవన నిర్మాణ అనుమతుల సేవలను ఆన్ లైన్లో ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

TNN 18 May 2016, 2:19 pm
హైదరాబాద్: భవన నిర్మాణ సేవలను ఇక నుంచి ఆన్ లైన్లో ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హెచ్ఎండీఏ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ బుధవారం ఆన్ లైన్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆన్ లైన్ సేవలను జీహెచ్ఎంసీ సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో జూన్ నాటికి అమల్లోకి తీసుకువస్తామన్నారు. దళారీ వ్యవస్థను అరికట్టేందుకు సేవలను ఆన్ లైన్లో ఉంచుతున్నట్లు మంత్రి వెల్లడించారు. తాజా నిర్ణయంతో ఇళ్ల నిర్మాణ అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పని నుంచి విముక్తి కల్పించినట్లయింది. ఇళ్ల నిర్మాణాల అనుమతులతో పాటు లే అవుట్, భూ బదలాయింపు సేవలు కూడా ఆన్ లైన్లోనే ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.