యాప్నగరం

ఆహారంగా పొరబడి గుళికలు తిని... ఆసుపత్రి పాలైన ముగ్గురు చిన్నారులు

ఆహరం అనుకొని గుళికలు తిన్న ముగ్గురు చిన్నారులు ఆసుపత్రి పాలైన ఘటన కోదాడలో చోటు చేసుకుంది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

Samayam Telugu 11 Jun 2019, 11:48 pm
తినే పదార్థం అనుకొని పొలాల్లో వేసే గుళికలు తినడంతో ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన సూర్యపేట జిల్లాలోని కోదాడలో చోటు చేసుకుంది. కృష్ణ ప్రియ థియేటర్ రోడ్డులో ఉన్న రాయల్ అపార్ట్‌మెంట్ దగ్గర ఆడుకుంటున్న మాదం శెట్టి అక్షిత (7), షేక్ అస్మా (6), షేక్ ఫర్హానా (9) పొరబాటున గుళికలను తినేశారు. ఈ విషయం గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై వారిని కోదాడ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.

వీరిలో షేక్ ఫర్హనా అనే చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే మరో హాస్పిటల్‌కు మార్చారు. మిగతా ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. ప్రస్తుతం వారిద్దరూ కోదాడ ప్రభుత్వ హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.