యాప్నగరం

సినారె అంత్యక్రియలు పూర్తి..

సాహితీ శిఖరాన్ని కడసారి చూడటానికి పెద్ద సంఖ్యలో కవులు, రచయితలు, భాషాభిమానులు తరలి వచ్చారు..

TNN 14 Jun 2017, 2:49 pm
ప్రముఖ కవి, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సి. నారాయణరెడ్డి అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. సాహితీ శిఖరాన్ని కడసారి చూడటానికి పెద్ద సంఖ్యలో కవులు, రచయితలు, భాషాభిమానులు తరలి వచ్చారు. బొగ్గులకుంటలోని సారస్వత్‌ పరిషత్‌ నుంచి ప్రారంభమైన సినారె అంతిమయాత్రలో వేలాది మంది పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో చివరి సంస్కారాలు నిర్వహించింది. సీఏం కేసీఆర్‌, పలువురు మంత్రులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
Samayam Telugu c narayana reddy final rights in mahaprasthanam
సినారె అంత్యక్రియలు పూర్తి..


విశ్వంభ‌రుడు సినారెకు సీఎం కేసీఆర్ ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు. అభిమాన క‌వి సినారె అంతిమ‌యాత్ర‌ను ఆయన ముందుండి నడిపించారు. అంత్య‌క్రియ‌ల తంతు ముగిసే వ‌ర‌కు ఆయన మ‌హాప్రస్థానంలోనే ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.