యాప్నగరం

కాకినాడ ఫలితం.. నంద్యాల చేతుల్లో?

ఈ నెల 28వ తేదీన నంద్యాల ఉప ఎన్నిక ఫలితం వెల్లడికాబోతోంది. ఆ రోజు పదిగంటలకే ఎవరు గెలుస్తారనే అంశంపై

TNN 26 Aug 2017, 10:15 am
ఈ నెల 28వ తేదీన నంద్యాల ఉప ఎన్నిక ఫలితం వెల్లడికాబోతోంది. ఆ రోజు పదిగంటలకే ఎవరు గెలుస్తారనే అంశంపై సూఛాయగా స్పష్టత వస్తుంది. మధ్యాహ్నం రెండు గంటలకు అధికారిక ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఇక నంద్యాల్లో విజయం పట్ల అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు విశ్వాసంతో ఉన్నాయి. ఎవరిని కదిలించినా.. తమదే విజయం అని అంటున్నారు. ఇక ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా పరస్పరం భిన్నమైన ఫలితాలను ప్రకటిస్తున్నాయి. దీంతో నంద్యాల్లో ఎవరు గెలుస్తారనే అంశం.. కౌంటింగ్ అయితే కానీ.. తేలే అవకాశాలు కనిపించడం లేదు.
Samayam Telugu can nandyal result impact on kakinada
కాకినాడ ఫలితం.. నంద్యాల చేతుల్లో?


ఇక ఈ నెల 29 తేదీన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఇప్పటికే అక్కడ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. రేపటితో ప్రచార గడువు ముగియనుంది. మొత్తం 48 డివిజన్లకు గానూ ఈ ఎన్నిక జరుగుతోంది. మరి ఇక్కడ ఏ పార్టీ ఎలా ప్రచారం చేసినా.. కాకినాడ ఫలితాన్ని మాత్రం నంద్యాల ఉప ఎన్నిక ప్రభావితం చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

28వ తేదీనే నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై క్లారిటీ రానుంది, 29 వ తేదీన కాకినాడ పోలింగ్ జరగనుంది. దీంతో నంద్యాల్లో గెలిచిన వాళ్లే.. కాకినాడను కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాకినాడ ఓటర్లు నంద్యాల ఫలితంతో ప్రభావితం కావడం ఖాయమనే మాట వినిపిస్తోంది. నంద్యాల ఓటర్లు ఎటువైపు నిలిస్తే.. కాకినాడ ఓటర్ కూడా అటువైపే నిలుస్తాడని విశ్లేషిస్తున్నారు.

అయితే అలాంటిదేమీ ఉండదు.. పరస్పరం విరుద్ధమైన రాజకీయ, సామాజిక వాతావరణం ఉన్న ప్రాంతాలివి. దీంతో.. నంద్యాల ఫలితంతో సంబంధం లేని రీతిలో కాకినాడ ఫలితం ఉండవచ్చనే మాట కూడా వినిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.