యాప్నగరం

నిరుద్యోగిపై కానిస్టేబుల్ ప్రతాపం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆధ్యర్యంలో ఇటీవల నిర్వహించిన గురుకుల

Samayam Telugu 1 Jun 2017, 5:57 pm
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆధ్యర్యంలో ఇటీవల నిర్వహించిన గురుకుల సంస్థల టీచర్ల రిక్రూట్ మెంట్ పరీక్షా కేంద్రంలో ఓ కానిస్టేబుల్ తన ప్రతాపాన్ని చూపించాడు. హైదరాబాద్ లోని దుండిగల్ ఎరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రానికి ఓ అభ్యర్థి కాస్త ఆలస్యంగా వచ్చాడని సదరు కానిస్టేబుల్ అతన్ని మెడపట్టి గెంటేశాడు.
Samayam Telugu candidate of a govt vacancy attacked by police man at written test centre in hyderabad
నిరుద్యోగిపై కానిస్టేబుల్ ప్రతాపం


అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరిస్తూ తరిమివేశాడు. తనకు పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలని అభ్యర్థి కానిస్టేబుల్ ను ప్రాధేయపడినా కనికరించలేదు. అభ్యర్థిపై కానిస్టేబుల్ ప్రతాపాన్ని ఎవరో వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే దాదాపు 6 లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. కానిస్టేబుల్ చర్యను ఖండించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.