యాప్నగరం

శ్రీశైలం: వాహన పూజ అనంతరం భక్తులపైకి దూసుకెళ్లిన కొత్త కారు

శ్రీశైలం సాక్షి గణపతి ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. కొత్త కారుకు పూజ నిర్వహిస్తుండగా భక్తులపైకి దూసుకెళ్లింది. ప్రమాదానికి గురైన కారు పూజారిదే కావడం శోచనీయం.

Samayam Telugu 25 May 2019, 10:46 pm
కొత్త కారుకు వాహన పూజ నిర్వహించడం కొంత మంది భక్తుల పాలిట శాపమైంది. కారులో ఉన్న వ్యక్తి బ్రేకులకు బదులు యాక్సిలరేటర్ తొక్కడంతో ఆలయంలోకి దూసుకెళ్లింది. ఒక్కసారిగా దూసుకొచ్చి పలువురు భక్తులను ఢీకొట్టింది. శ్రీశైలంలోని సాక్షి గణపతి ఆలయం వద్ద శనివారం (మే 25) ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. బాధిత భక్తులంతా సంగారెడ్డి వాసులుగా గుర్తించారు.
Samayam Telugu car


గుడిలో పూజలు చేస్తున్న భక్తులపైకి దూసుకెళ్లిన కొత్త కారు పూజారిదే కావడం శోచనీయం. పూజారి సిద్ధూ సాక్షి గణపతి ఆలయం వద్ద తన కొత్త కారుకు వాహన పూజ చేయించాడు. అనంతరం కారును ముందుకు తీసే క్రమంలో పొరపాటున యాక్సిలరేటర్ తొక్కడంతో అది ఆలయంలోని భక్తులపైకి దూసుకెళ్లింది.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని శ్రీశైలం ఆలయం అంబులెన్స్‌లో సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.