యాప్నగరం

ఓట్ల కోసమే అలా చేస్తారు.. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మతపరమైన ఉద్రిక్తల్ని రెచ్చగొట్టేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై ఫలక్‌నుమా పీఎస్‌లో కేసు నమోదయ్యింది.

Samayam Telugu 12 Jun 2018, 1:28 pm
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మతపరమైన ఉద్రిక్తల్ని రెచ్చగొట్టేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై ఫలక్‌నుమా పీఎస్‌లో కేసు నమోదయ్యింది. ఫేస్‌బుక్‌లో ఆయన పోస్ట్ చేసిన వీడియోతోనే ఈ వివాదం మొదలయ్యింది. ఆ వీడియోలో 'ఓట్ల కోసమే రాజకీయ నేతలు, పార్టీలు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తున్నారు.. అలాంటి వాటిని నేను ఎప్పుడూ నిర్వహించను.. వాటికి దూరంగా ఉంటా. తెలంగాణ నేతలు.. ఈ ఇఫ్తార్ విందులతో బిజీ అయ్యారు. టోపీలు పెట్టుకొని సెల్ఫీలు తీసుకుంటున్నారు. వారంతా సబ్‌ కా సాథ్.. సబ్ కా వికాస్ గురించి ఆలోచిస్తే మంచిదని' వ్యాఖ్యానించారు.
Samayam Telugu Raja Singh


ఈ వీడియో పెద్ద దుమారాన్నే రేపగా.. ముస్లిం పెద్దలు మండిపడ్డారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో.. మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా రాజాసింగ్‌ వ్యాఖ్యలు ఉన్నాయని కేసు నమోదు చేశారు. ఐపీసీ 152 (ఏ) కింద ఎఫ్‌ఐఆర్ ఫైల్ అయ్యింది. ఈ వీడియోపై ఎమ్మెల్యే వివరణ కోరామన్నారు సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ. ఆయన స్పందించకపోతే.. చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. రంజాన్‌ సందర్భంగా అందరు ఎమ్మెల్యేల్లాగానే ఇఫ్తార్‌ విందు ఇవ్వాలని రాజాసింగ్‌కు ఓ స్నేహితుడు సూచన చేశాడట. దీనిపై స్పందిస్తూనే ఆయన.. ఈ వీడియోను పోస్ట్ చేయగా.. పెద్ద దుమారాన్ని రేపింది. పరిస్థితి కేసు నమోదు చేసే వరకు వెళ్లింది.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.