యాప్నగరం

ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు సుప్రీం నోటీసులు

ఓటుకు నోటు కేసులో వివరణ ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సుప్రీంకోర్టు ఆదేశించింది.

TNN 7 Mar 2017, 6:22 am
ఓటుకు నోటు కేసులో వివరణ ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం నోటీసులు జారీ చేసింది. చంద్రబాబుతోపాటు తెలంగాణ ఏసీబీకి సైతం నోటీసులు ఇచ్చింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను కౌంటర్ల రూపంలో తమ ముందుంచాలని పేర్కొంది.
Samayam Telugu cash for vote case against ap cm chandrababu naidu
ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు సుప్రీం నోటీసులు


జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే, జస్టిస్‌ లావు నాగేశ్వరరావులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఓటుకు నోటు సంబంధించిన ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరపాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరిపించాలంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్కే) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు కోర్టు స్వీకరించింది.

పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, తంగిరాల విజయభాస్కర్‌రెడ్డిలు హాజరయ్యారు. కేసు విచారణకు రాగానే చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూత్రా తన వాదన వినిపించారు. అంతే కాకుండా ఈ కేసులో పిటిషనర్‌కు జోక్యం చేసుకొనే అర్హత లేదని హైకోర్టు తీర్పు వెలువరించిందని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.