యాప్నగరం

కరెన్సీ కష్టాలు తీర్చేందుకు బాబు నేతృత్వంలో కమిటీ !

కరెన్సీ కష్టాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కమిటీ వేయాలని నిర్ణయించింది.

TNN 28 Nov 2016, 4:28 pm
కరెన్సీ కష్టాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కమిటీ వేయాలని నిర్ణయించింది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే ఈ కమిటీకి చంద్రబాబు నేతృత్వం వహించాలని కేంద్రం కోరింది. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఏపీ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేశారు. నోట్ల రద్దు అంశంపై ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఈ సందర్భంగా ఇరువురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా నోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు కమిటీ వేస్తున్నామని.. దీనికి నేతృత్వం వహించాలని చంద్రబాబును జైట్లీ కోరారు.
Samayam Telugu center has decided to set up a committee to solve the problem of the shortage of notes
కరెన్సీ కష్టాలు తీర్చేందుకు బాబు నేతృత్వంలో కమిటీ !


జైట్లీ ప్రతిపాదనపై చంద్రబాబు స్పందిస్తూ కమిటీకి నేతృత్వం వహించే అంశాన్ని పరిశీలిస్తానని.. అయితే ఇప్పుడే తన నిర్ణయం చెప్పలేనని చంద్రబాబు అన్నట్లు తెలిసింది. ఈ సందర్భంలో బ్యాంకర్ల తీరు పట్ల చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. బ్యాంకర్ల సహాయ నిరాకరణ, నిర్వహణ లోపాల వల్లే జనాలు ఇబ్బందులు పడుతున్నారని జైట్లీకి చంద్రబాబు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.