యాప్నగరం

ఏపీకి కేంద్ర ప్ర‌భుత్వం మరో షాక్

ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం, అంచనాల ఆమోదంలో ముందడుగు పడకపోగా తాజాగా ఏపీ ప్రభుత్వం సమర్పించిన డిజైన్ సైతం తిర‌స్క‌ర‌ణ‌కు గురైన‌ట్లు తెలుస్తోంది

Samayam Telugu 15 Aug 2018, 10:38 am
ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం, అంచనాల ఆమోదంలో ముందడుగు పడకపోగా తాజాగా ఏపీ ప్రభుత్వం సమర్పించిన ప్రాజెక్టు డిజైన్లను సైతం కేంద్రం ఆమోదించలేదని తెలుస్తోంది. రాష్ట్ర జలవనరుల శాఖ పంపించిన డిజైన్లను ఆమోదించని సీడబ్ల్యూసీ విభాగం అధికారులు తామే క్షేత్రస్థాయిలో పర్యటించి డిజైన్లను పరిశీలిస్తాం అని ఏపీ ప్రభుత్వానికి తెలియజేసినట్లు సమాచారం.
Samayam Telugu పోల‌వ‌రం సాగునీటీ ప్రాజెక్ట్


ప్రాజెక్ట్ అంచనాల ఆమోదంలో జాప్యం జరిగినట్టయితే, ఆ వెంటనే రూ. 10వేల కోట్లు మంజూరు చేయాలని, కాపర్ డ్యామ్, స్పిల్ చానల్ పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన డిజైన్లను ఆమోదించాల్సిందిగా రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు చేసిన అభ్యర్థనకు స్పందనగా కేంద్రం నుంచి ఈ సమాచారం అందినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనుల పూర్తికి సీడబ్ల్యూసీ ఆమోదిస్తే కానీ నిధులు విడుదల కావు. నిధులు విడుదల కానిదే ప్రాజెక్టు పనులు ముందుకు సాగవు. ఫలితంగా ప్రాజెక్టు పనులను పూర్తిచేయడంలో మరింత ఆలస్యం అయ్యే ప్రమాదం ఉందని తాము ఎప్పటికప్పుడు కేంద్రానికి విన్నవిస్తూ వస్తున్నామని ఏపీ సర్కార్ ఆవేదన వ్యక్తంచేస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.