యాప్నగరం

నాకు ఇంత చిన్న పదవా? బాబుపై చల్లా ఫైర్

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు కర్నూలు జిల్లా టీడీపీ నేత

Samayam Telugu 12 Apr 2018, 2:23 pm
తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు కర్నూలు జిల్లా టీడీపీ నేత చల్లా రామకృష్ణారెడ్డి. తనకు తగిన ప్రాధాన్యత ఉన్న పదవిని ఇవ్వలేదని చల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఏపీలో జరిగిన నామినేటెడ్ పోస్టుల భర్తీలో చల్లాకు ఆర్టీసీ రాయలసీమ రీజియన్ చైర్మన్ పదవిని ఇచ్చారు. అయితే తన స్థాయికి ఈ పదవి చాలా తక్కువ అని, తను ఈ పదవిని తీసుకోవడం లేదని చల్లా ప్రకటించారు.
Samayam Telugu challa


ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా వర్ల రామయ్యను నియమిస్తూ, రీజియన్ ఎండీగా చల్లాను నియమిస్తూ బాబు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి వర్ల రామయ్య అని, తను ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని అని.. ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తికి ప్రాధాన్యత ఉన్న పదవిని ఇచ్చి, తనకు అప్రాధాన్య పదవిని ఇచ్చి అవమానించారని చల్లా వ్యాఖ్యానించారు.

తనను చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించినప్పుడు ఎమ్మెల్సీ పదవిని ఇస్తారని హామీ ఇచ్చారని, అయితే ఆ హామీని నిలబెట్టుకోలేదని చల్లా అన్నారు. ఆర్టీసీ రీజియన్ ఎండీ పదవిని తను తీసుకోవడం లేదని, భవిష్యత్ కార్యా చరణ విషయంలో అనుచరులతో చర్చిస్తానని, అనంతరం ప్రకటిస్తానని ఈ సీనియర్ పొలిటీషియన్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.