యాప్నగరం

భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్షా సమావేశం

ఏపీలోని వివిధ జిల్లాలపై భారీ వర్షాలు ప్రతాపం చూపిస్తున్నాయి.

TNN 22 Sep 2016, 2:06 pm
ఏపీలోని వివిధ జిల్లాలపై భారీ వర్షాలు ప్రతాపం చూపిస్తున్నాయి. గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రభావం తీవ్రంగా ఉంది. గుంటూరులో అయితే పరిస్థితి మరీ అధ్వనంగా ఉంది. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఈ సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఉమా మహేశ్వరరావు, జల వనరుల శాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
Samayam Telugu chandra babu meeting with officials over heavy rains
భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్షా సమావేశం


హరీశ్‌కు ఉమా ఫోన్...
ఏపీ మంత్రి ఉమా తెలంగాణ మంత్రి హరీశ్ కు ఫోన్ చేశారు. వర్షాలు పడుతుండడంతో నల్లగొండలోని పులిచింతల ప్రాజెక్టుకు వరదనీరు భారీగా చేరుతోందని తెలిపారు. ఆ వరదతో రెండు రాష్ట్రాల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని వివరించారు. ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని, పరిస్థితి సంయుక్తంగా పర్యవేక్షిద్దామని హరీశ్ రావుకు చెప్పారు. ఈ విషయంలో హరీశ్ రావు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.