యాప్నగరం

ఈ టీడీపీ నేతను గుర్తుపట్టారా?

ఒకప్పుడు ఆయన టీడీపీలో ముఖ్య నేత. చంద్రబాబు తరువాత నెంబర్ 2 ఆయనే అనే వారు.

TNN 11 May 2017, 2:23 pm
ఒకప్పుడు ఆయన టీడీపీలో ముఖ్య నేత. చంద్రబాబు తరువాత నెంబర్ 2 ఆయనే అనే వారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కనిపించకుండా పోయారు. ఎక్కడున్నారో? ఏమయ్యారో చాలా మందికి తెలియదు. అతనే టీడీపీ సినియర్ నేత దేవేందర్ గౌడ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హోంమంత్రిగా కూడా పనిచేశారు. ఆ వ్యక్తి తరువాత నవ తెలంగాణ పేరు పార్టీ పెట్టడం, దానిని మూసేసి చిరంజీవి పెట్టి ప్రజారాజ్యం వెళ్లడం జరిగాయి. అక్కడ కూడా ఇమడలేక మళ్లీ సొంత గూటికే వచ్చేశారు. టీడీపీలోకి తిరిగి వచ్చాక కొన్ని రోజులు పార్టీ కార్యక్రమాల్లో కనిపించారు. అనంతరం ఆయన చాలా అరుదుగా కనిపించడం మొదలుపెట్టారు. ఇక కొన్ని నెలల నుంచి ఆయన గురించి ఏ వార్త లేదు. ఎక్కుడున్నారో? ఎలా ఉన్నారో తెలియలేదు.
Samayam Telugu chandra babu visits devender goud in america
ఈ టీడీపీ నేతను గుర్తుపట్టారా?


ప్రస్తుతం అమెరికాలో ఉన్న చంద్రబాబు దేవేందర్ గౌడ్ ను కలవడంతో మళ్లీ వార్తల్లోకి వచ్చారు. చంద్రబాబుతో కూర్చున్నది ఎవరో పోల్చుకోవడానికి టీడీపీ వారికే కాస్త సమయం పట్టింది. అంతగా ఆయన మారిపోయారు. నల్లగా, ముఖం ఉబ్బినట్టు అయ్యింది. ఆయన అలా అవ్వడానికి కారణం క్యాన్సర్. కొన్ని నెలలుగా ఆయన క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నారు. అమెరికాలోని రాచెస్టర్‌లోని మేయో క్లినిక్‌లో ఆయనకు చికిత్స సాగుతోంది. అందుకే ఆయనను పరామర్శించడానికి చంద్రబాబు వెళ్లారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.