యాప్నగరం

కేసీఆర్ వ్యాఖ్యలు బాధాకరం: చంద్రబాబు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కౌంటర్ ఇచ్చారు. అభివృద్ధిలో తెలంగాణకు ఆంధ్రప్రదేశ్‌కు పోలికేలేదన్న కేసీఆర్‌ వ్యాఖ్యలను చంద్రబాబు తప్పుబట్టారు.

TNN 19 Jan 2018, 12:29 pm
Samayam Telugu chandrababu faults telangana cm kcr comments on ap
కేసీఆర్ వ్యాఖ్యలు బాధాకరం: చంద్రబాబు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కౌంటర్ ఇచ్చారు. అభివృద్ధిలో తెలంగాణతో ఆంధ్రప్రదేశ్‌కు పోలికేలేదన్న కేసీఆర్‌ వ్యాఖ్యలను చంద్రబాబు తప్పుబట్టారు. కేసీఆర్ వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోవడానికి కారణం ప్రజలు కాదని, విభజన వల్లే తాము నష్టపోయామని అన్నారు. శుక్రవారం రెండోరోజు కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు.. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.

తెలంగాణను ఆంధ్రా పాలకులు ధ్వంసం చేశారన్న కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదని చంద్రబాబు అన్నారు. 1995కు ముందు, తరువాత హైదరాబాద్‌ అభివృద్ధిని గమనిస్తే వాస్తవాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. వృద్ధిలో ఇతర రాష్ట్రాల కన్నా 20 నుంచి 30 శాతం వెనుకబడి ఉన్నామని, విభజనలో యూపీఏ ప్రభుత్వం చేసిన అన్యాయం వల్లే ఆంధ్రప్రదేశ్‌కు ఈ పరిస్థితి వచ్చిందని సీఎం అన్నారు. దక్షిణ భారతదేశంలో తలసరి ఆదాయంలో ఏపీ అట్టడుగున ఉందని చంద్రబాబు చెప్పారు. ఇందుకు కారణం ప్రజలు కాదని, విభజనతో వచ్చి కష్టం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనన్నారు.

తలసరి ఆదాయంలో ఇతర రాష్ట్రాలతో సమాన స్థాయికి వచ్చేంత వరకు కేంద్రం ఆదుకోవాని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఆంధ్రాలో ఉన్నవాళ్లంతా హైదరాబాద్ వెళ్లి పెట్టుబడులు పెట్టడం వల్లే ఇక్కడ పరిస్థితి బాగాలేదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్న మాటలను కూడా చంద్రబాబు గుర్తు చేశారు. అప్పటి ఉమ్మడి రాష్ట్రానికి హైదరాబాద్‌ రాజధాని కాబట్టే అందరూ వెళ్లారని, మళ్లీ వాళ్లని అక్కడి నుంచి రమ్మనడం సమంజసం కాదన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.