యాప్నగరం

చంద్రబాబు ట్వీట్ రగడ: ఆపదలో ఉన్న మహిళలను ఆడుకుంటాం!

ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి తప్పులో కాలేశారు. సాక్షాత్తూ తన అధికారిక ట్విటర్‌ పేజీలో అచ్చు తప్పు పెట్టారు. ఆపదలో ఉన్న మహిళల కోసం ఏపీ ప్రభుత్వం గురువారం (సెప్టెంబర్ 21) ‘181 కాల్‌ సెంటర్‌’ ప్రారంభించింది. ఈ విషయాన్ని తెలుపుతూ సీఎం చంద్రబాబు..

TNN 21 Sep 2017, 7:06 pm
ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి తప్పులో కాలేశారు. సాక్షాత్తూ తన అధికారిక ట్విటర్‌ పేజీలో అచ్చు తప్పు పెట్టారు. ఆపదలో ఉన్న మహిళల కోసం ఏపీ ప్రభుత్వం గురువారం (సెప్టెంబర్ 21) ‘181 కాల్‌ సెంటర్‌’ ప్రారంభించింది. ఈ విషయాన్ని తెలుపుతూ సీఎం చంద్రబాబు అధికారిక ట్విటర్‌ పేజీలో ఓ పోస్ట్‌ పెట్టారు. అందులో.. ‘ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడమే లక్ష్యంగా..’ అని రాయడానికి బదులు ‘ఆపదలో ఉన్న మహిళలను ఆడుకోవడమే లక్ష్యంగా 181 కాల్ సెంటర్ ఏర్పాటు చేశాము’ అని రాసుకొచ్చారు. ఆ తర్వాత కాసేపటికి అసలు విషయాన్ని గమనించి సదరు ట్వీట్‌ను డిలీట్ చేశారు.
Samayam Telugu chandrababu launches 181 call center for women
చంద్రబాబు ట్వీట్ రగడ: ఆపదలో ఉన్న మహిళలను ఆడుకుంటాం!


ఓ వైపు మంత్రి లోకేశ్‌ తన అధికారిక కార్యక్రమాల్లో తడబాటు మాటలతో కంగారెత్తిస్తుండగా.. ఇప్పుడు ఆయన తండ్రి కూడా అదే దారిలో నడవడం చర్చనీయాంశంగా మారింది. బహిరంగ వేదికలపై, పార్టీ సమావేశాల్లో పొరపాటుగా మాట్లాడటం ‘చినబాబు’కు అలవాటుగా మారిన విషయం తెలిసిందే. చంద్రబాబు కూడా గతంలో ఇలాగే పొరపాటుగా మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన.. ‘ఏపీని అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా మార్చేంత వరకూ నిద్రపోను’ అని అన్నారు.

ఏదేమైనా ఈ రకంగానైనా.. ఈ 181 కాల్ సెంటర్లకు మంచి ప్రచారం లభిస్తే అదే పదివేలు. గృహహింస, ఈవ్ టీజింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ తదితర సమస్యలకు పరిష్కారంగా 181 కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్ సెంటర్లకు సంబంధించిన పోస్టర్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. 181 కాల్ సెంటర్‌ ద్వారా ఆపదలో ఉన్న మహిళలకు తక్షణమే సాయం అందిస్తామని ఆయన తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.