యాప్నగరం

‘వార్ధా’ తుపానుపై చంద్రబాబు సమీక్ష

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.

TNN 12 Dec 2016, 2:27 pm
వార్ధా తుపాను దూసుకొస్తుండడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, కడప జిల్లాల కలెక్టర్లు, విద్యుత్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. చెన్నై నగరానికి అత్యంత సమీపంలో వార్దా తుపాను కేంద్రీకృతమై ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. 255 లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఆదేశించారు. చెరువులు గండ్లు పడితే కొన్ని గంటల్లోనే గండ్లు పూడ్చేలా సర్వవిధాలుగా సిద్ధంగా ఉండాలన్నారు. కట్టర్లు సిద్ధంగా ఉంచుకోవాలని, చెట్లు కూలిన వెంటనే వాటిని రహదారుల మీద నుంచి వెంటనే తొలగించాలని తెలిపారు. అలాగే కూరగాయలు, పాలు, బ్రెడ్, ఇతర నిత్యావసర సరుకులు సిద్ధంగా ఉంచుకోవాలని, వాటిని తుపాను బాధిత ప్రజలకు అందించాలని ఆదేశించారు.
Samayam Telugu chandrababu naidu has alerted officials on cyclone vardah
‘వార్ధా’ తుపానుపై చంద్రబాబు సమీక్ష

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.