యాప్నగరం

ఏపీ ప్రజల కల నెరవేరుతోంది: చంద్రబాబు

పోలవరం స్వాతంత్ర్యం రాకముందు నుంచి ఉన్న కోరిక అని, ఇన్నాళ్లకు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక నెరవేరుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు అన్నారు.

TNN 26 Dec 2016, 3:22 pm
పోలవరం స్వాతంత్ర్యం రాకముందు నుంచి ఉన్న కోరిక అని, ఇన్నాళ్లకు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక నెరవేరుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు నాబార్డ్ ద్వారా రూ. 1981 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ నిధుల చెక్కును సోమవారం ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి నుంచి చంద్రబాబు అందుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చినప్పటి నుంచి చాలా అడ్డంకులు వచ్చాయని చంద్రబాబు అన్నారు. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చొవరతో అవన్నీ తొలగిపోయాయని వివరించారు.
Samayam Telugu chandrababu naidu on nabard funds for polavaram project
ఏపీ ప్రజల కల నెరవేరుతోంది: చంద్రబాబు


పోలవరం బహుళార్థ సాధక పథకం అని చంద్రబాబు అభివర్ణించారు. గతంలో తాను 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా పోలవరానికి నిధులు రాలేదని, నదుల అనుసంధానాన్ని అప్పటి యూపీఏ ప్రభుత్వం నిర్లక్యం చేసిందని చెప్పారు. 2018 మే కల్లా ప్రాజెక్టు ప్రధాన పనులు పూర్తవుతాయని, 2019 నాటికి ప్రాజెక్టును సంపూర్ణంగా పూర్తిచేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చంద్రబాబు వివరించారు. పోలవరం ప్రాజెక్టును రికార్డు స్థాయిలో పూర్తిచేసి చూపిస్తామని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.