యాప్నగరం

బాలకృష్ణ రియల్ హీరో అని ప్రశంసించిన చంద్రబాబు

బాలకృష్ణ సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ ఆయన హీరోనే అని ప్రశంసించారు ఏపీ సీఎం చంద్రబాబు..

Samayam Telugu 9 Apr 2017, 3:53 pm
బాలకృష్ణ సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ ఆయన హీరోనే అని ప్రశంసించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆదివారం హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో కొత్త భవనం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. పేదలకి సేవ చేస్తూ ఎన్టీఆర్ ఆశయాలని బాలకృష్ణ ముందుకు తీసుకెళ్తున్నారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడేవాళ్లు ఎక్కడెక్కడి నుంచో చికిత్స కోసం ఇక్కడికి వస్తుంటారు. ఎప్పుడు చనిపోతామో ఏమో అనే భయంతో బిక్కుబిక్కుమనే వారికి ఇక్కడ ఉచితంగా వైద్య సహాయం అందించి, వారి ప్రాణాలు నిలబెడుతున్న ఈ సంస్థని ముందుండి నడిపిస్తున్న బాలకృష్ణ నిజంగానే హీరో అని చెబుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu chandrababu says balakrishna is a real hero
బాలకృష్ణ రియల్ హీరో అని ప్రశంసించిన చంద్రబాబు


ఇదిలావుంటే, ఈ కార్యక్రమంలో మాట్లాడిన బాలకృష్ణ.. దాతల సహాయంతోనే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో వైద్య సహాయం అందిస్తున్నాం అని అన్నారు. సంస్థ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతోమంది దాతలు తమ వంతు సహాయం చేశారు అని గుర్తుచేసుకున్న బాలకృష్ణ.. ఎంతో బిజీ షెడ్యూల్లోనూ వుండి కూడా తమ ఆస్పత్రిలో కొత్త భవనాన్ని ప్రారంభించడానికి వచ్చినందుకు సీఎం చంద్రబాబుకి ఆస్పత్రి తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.