యాప్నగరం

చంద్రబాబు దావోస్ పర్యటన విశేషాలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.

TNN 23 Jan 2017, 4:04 pm
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఆయన అనేకమంది వ్యాపార వేత్తలు, పెట్టుబడి దారులతో ఆయన సమావేశమయ్యారు. అమరావతికి పెట్టుబడులు తెచ్చేందుకు వారితో చర్చించారు. పర్యటన ముగించుకుని వచ్చి ఏపీకి చేరుకున్న ఆయన అమరావతిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దావోస్ పర్యటన విశేషాలను వివరించారు.
Samayam Telugu chandrababu tells to media about his davos tour
చంద్రబాబు దావోస్ పర్యటన విశేషాలు


సదస్సుకు హాజరైన వారిలో 1200 మంది కంపెనీల సీఈవోలేనని, వారందరినీ తాను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించినట్టు తెలిపారు. 2011 నాటికి దేశంలోని టాప్ 3 రాష్ట్రాల్లో ఏపీకి ఒకటి చూడాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. ఏపీలో అడుగుపెట్టేందుకు తాము ముందుగా అధ్యయనం చేస్తామని అగ్రశ్రేణి కంపెనీ బిబోబ్ తెలిపిందని చెప్పారు. జింక్ స్మెల్టర్ ఒక యూనిట్ ఏపీలో పెట్టేందుకు ముందుకొచ్చిందని తెలిపారు. అలాగే రిఫైనరీ స్థాపనకు సౌదీ అరాంకో ముందు కొచ్చిందని ఆ సంస్థ ప్రతినిధులు మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కు రానున్నారని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.