యాప్నగరం

బాల్యానికి మూడుముళ్లా.. ఇట్లు మీ...

బాల్యం మూడు ముళ్లనే బంధంలో చిక్కుకుపోతోంది. ఆడుతూ పాడుతూ గడపాల్సిన పసి ప్రాయంలో... పెళ్లి పీటలెక్కాల్సి వస్తోంది. కనీసం 18 ఏళ్లు నిండకముందే... బాలికల జీవితాలను సంసారమనే ఊబిలోకి నెట్టేస్తున్నారు పెద్దలు. జీవితంలో వారు కష్టాలను బయటి ప్రపంచానికి తెలియ చెప్పే ప్రయత్నం చేశారు కొంతమంది బాధితులు. ధైర్యంగా వారి కన్నీటి గాధను ఓ లేఖలో హైకోర్టు సీజే దృష్టికి తీసుకొచ్చారు.

TNN 4 Feb 2018, 4:54 pm
బాల్యం మూడు ముళ్లనే బంధంలో చిక్కుకుపోతోంది. ఆడుతూ పాడుతూ గడపాల్సిన పసి ప్రాయంలో... పెళ్లి పీటలెక్కాల్సి వస్తోంది. కనీసం 18 ఏళ్లు నిండకముందే... బాలికల జీవితాలను సంసారమనే ఊబిలోకి నెట్టేస్తున్నారు పెద్దలు. తెలుగు రాష్టాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వెనుకబడిన జిల్లాల్లో ఏ ప్రాంతానికి వెళ్లినా గడపకో బాలిక వధువు కనిపిస్తుంది. జీవితంలో వారు కష్టాలను బయటి ప్రపంచానికి తెలియ చెప్పే ప్రయత్నం చేశారు కొంతమంది బాధితులు. ధైర్యంగా వారి కన్నీటి గాధను ఓ లేఖలో హైకోర్టు సీజే దృష్టికి తీసుకొచ్చారు. 11మంది బాలికలు రాసిన ఆ లెటర్ వారిని కదిలించింది. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని పిల్‌గా స్వీకరించింది.
Samayam Telugu child brides write to cj hc makes it pil
బాల్యానికి మూడుముళ్లా.. ఇట్లు మీ...


సీజేకు రాసిన లేఖలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించారు. తమకు చిన్నతనంలోనే పెళ్లి చేశారని... అప్పటి నుంచి అష్టకష్టాలు పడుతున్నామని తెలియజేశారు. తమతో పాటు పుట్టిన పిల్లలు కూడా తరచూ అనారోగ్యంతో బాధపడాల్సి వస్తోందని... ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలన్నా ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమలాంటి బాధితులు రాష్ట్రవ్యాప్తంగా చాలామంది ఉన్నారని సీజే దృష్టికి తీసుకొచ్చారు. వచ్చేవారం ఈ పిల్‌ విచారణకు రానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.