యాప్నగరం

చిలుకూరు పూజారి పెద్ద మనసు.. చెవిటామెకు చేయూత!

హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో పువ్వులు అమ్ముకునే కమలమ్మ అనే మహిళను చిలుకూరు వేంకటేశ్వర స్వామి పూజారి ఎంవీ సుందరరాజన్ ఆదుకున్నారు.

Samayam Telugu 29 Aug 2018, 4:34 pm
హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో పువ్వులు అమ్ముకునే కమలమ్మ అనే మహిళను చిలుకూరు వేంకటేశ్వర స్వామి పూజారి ఎంవీ సుందరరాజన్ ఆదుకున్నారు. గత మూడు దశాబ్దాలుగా ఆమె ఎదుర్కొంటున్న వినికిడి సమస్య చికిత్సకు ఆయన సహాయం అందించారు. 45 ఏళ్ల కమలమ్మ చిలుకూరు బాలాజీకి నిత్యం పూల మాలలు పంపిస్తుంటుంది.
Samayam Telugu 65572295


ఇటీవల రాఖీ సందర్భంగా పూజారి సుందరరాజన్‌కు రాఖీ కట్టిన ఆమె తాను ఎదుర్కొంటున్న సమస్యను వివరించింది. 30 ఏళ్లు నుంచి తాను వినికిడి సమస్య ఎదుర్కొంటున్నానని, వైద్యులను సంప్రదిస్తే రూ.60 వేలు విలువ చేసే మిషిన్‌ను పరికరాన్ని చెవిలో అమరుస్తామని చెప్పారని తెలిపింది. దీంతో సుందరరాజన్ గాంధీ ఆసుపత్రిలోని ఈఎన్టీ సర్జన్ డాక్టర్ శ్రీకాంత్‌ను సంప్రదించారు. అనంతరం కమలమ్మను ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్ష చేయించారు.

ఈ సందర్భంగా ఆమె చికిత్సకయ్యే ఖర్చంతా తానే భరిస్తానని తెలిపారు. సుందరరాజన్ సాయానికి కమలమ్మ సంతోషం వ్యక్తం చేసింది. వైద్యులు ఆమె సమస్య తీరుతుందని చెప్పడంతో ఆమె భావోద్వేగానికి గురైంది. ఆయన దేవుడిలా వచ్చి తనను ఆదుకుంటున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా రాజన్ స్పందిస్తూ.. రాఖీ అనుబంధాలకు నిదర్శనమని, తనకు రాఖీ కట్టిన పేద మహిళకు సాయం చేయడం ధర్మంగా భావించానని తెలిపారు. ఈ సమాచారం ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో ప్రచారం కావడంతో హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ (హెచ్‌హెచ్ఎఫ్) అనే సంస్థ ఆమెకు సాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.