యాప్నగరం

కసాయి తండ్రి: భార్యతో గొడపడి పిల్లల్ని నదిలో విసిరేశాడు

భార్యాభర్తల మధ్య చోటుచేసుకున్న విభేదాలు వారి ముగ్గురు చిన్నారులను బలితీసుకున్నాయి. హృద‌య‌విదారకమైన ఈ ఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో చోటుచేసుకుంది.

Samayam Telugu 6 Aug 2018, 10:51 am
భార్యాభర్తల మధ్య చోటుచేసుకున్న విభేదాలు వారి ముగ్గురు చిన్నారులను బలితీసుకున్నాయి. హృద‌య‌విదారకమైన ఈ ఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో చోటుచేసుకుంది. శెట్టిగారిపెల్లకు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి భార్య కాపురానికి రావడం లేదనే అక్కసుతో ముగ్గురు పిల్లలను నదిలో పడేసి వారి చావుకు కారణమయ్యాడు. తన ముగ్గురు కుమారులు పునీత్(5), సంజయ్(3), రాహుల్(2)ను ఆదివారం నీవా నదిలో పడేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Samayam Telugu కసాయి తండ్రి.. బిడ్డలను నదిలో పడేసిన హత్య

శెట్టిగారిపల్లెకు చెందిన వెంకటేష్‌కు అమరావతితో ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి పునీత్(5), సంజయ్(3), రాహుల్(2) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.
వెంకటేశ్ తాగుడుకు బానిసగా మారడంతో భార్యభర్తలు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.

గతంలోనూ భార్యభార్తల మధ్య గొడవలు జరిగినప్పుడు పెద్దలు సర్దిచెప్పినా వెంకటేశ్ ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో రెండు రోజుల కిదంట అమరావతి తన పుట్టింటికి వెళ్లిపోయింది.దీంతో ఆమె పుట్టింటికి ఆదివారం వెళ్లిన వెంకటేశ్ భార్యను కాపురానికి రావాల్సిందిగా కోరాడు. ఆమె ససేమిరా అనడంతో ఆగ్రహించిన వెంకటేష్ ఆదివారం రాత్రి తన ముగ్గురు పిల్లలను తీసుకెళ్లి నీవా నదిలో పడేసి హత్యచేశాడు. మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడి అన్నెంపున్నెం ఎరుగని చిన్నారులను కర్కశంగా హతమార్చాడు. తన ముగ్గురు పిల్లల్ని తండ్రే దారుణంగా చంపేయడంతో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. దీనికి గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసి పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.