యాప్నగరం

ప్రవాసాంధ్రుల పెట్టుబడులే లక్ష్యం

పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు అమెరికాలో పర్యటించనున్నారు.

TNN 14 Oct 2016, 10:15 am
విజయవాడ: నవ్యాంధ్రలో పెట్టుబడులే లక్ష్యంగా మరోమారు ఏపీ సీఎం చంద్రబాబు అమెరికాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈ ఏడాది నవంబర్ 13 నుంచి 21 వరకు ఏపీ సీఎం అమెరికాలో పర్యటిస్తారని అధికారిక ప్రకటన వెలువడింది. ఈ పర్యటనలో చంద్రబాబుతో పాటు ఏపీ మంత్రులు యనమల, నారాయణ సహా 12 మంది అధికారుల బృందం ఉంటుంది. కాగా ఈ పర్యటనలో ఏపీ సీఎం న్యూయార్క్, చికాగో సహా పలు ప్రధాన నగరాల్లో పర్యటిస్తారు. ఇదిలా ఉండగా బాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక ఎన్ఆర్‌ఐ శాఖ చూస్తోంది.
Samayam Telugu cm chnadrabau america tour shedule
ప్రవాసాంధ్రుల పెట్టుబడులే లక్ష్యం


ప్రవాసాంధ్రుల పెట్టుబడులే లక్ష్యం..

ప్రవాసాంధ్రుల పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు తన అమెరికా పర్యటన కొనసాగిస్తారు. ఈ పర్యటనలో భాగంగా వివిధ నగరాల్లో స్థిరపడిన ఆంధ్రోళ్లను చంద్రబాబు
కలుసుకొని నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టాలని కోరతారు. అలాగే స్మార్ట్ విలేజ్ కార్యక్రమంలో పాల్గొనాలని ఎన్నారైలను సూచించనున్నారు. మరో 7 వేల గ్రామాలు
దత్తత తీసుకునేలా చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే స్మార్ట్ విలేజ్ కార్యక్రమానికి ఏపీలో మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంలో మరికొంత
మంది ఎన్నారైలను భాగస్వాములు చేయాలన్నదే చంద్రబాబు ఆలోచన. ఈ ఉధ్దేశంతోనే ఏపీ సీఎం అమెరికాలో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.