యాప్నగరం

‘మోదీ.. చేస్తవ చస్తవా’ అని చెప్పి మరీ సాధించా: కేసీఆర్

ఆ నిర్ణయం విషయంలో మోదీ ఊగిసలాడుతుంటే.. చేస్తవ చస్తవా అంటూ ఉద్యోగాల్లో తెలంగాణ బిడ్డలకు 95 శాతం రిజర్వేషన్లను సాధించుకున్నాం.. అని కేసీఆర్ వెల్లడించారు.

Samayam Telugu 2 Sep 2018, 7:59 pm
తెలంగాణ వచ్చిన రోజు గుండెల నిండా ఎంత సంతోషపడ్డానో.. తెలంగాణ ఉద్యోగాల్లో 95 శాతం రిజర్వేషన్లు సాధించినప్పుడు అంతే సంతోషపడ్డానని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం రాత్రి కొంగర కలన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ ప్రగతి నివేదన సభలో కేసీఆర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యక్రమాల గురించి వివరించారు.
Samayam Telugu KCR Speach Photos2


రాష్ట్రంలోని ఉద్యోగాల్లో తెలంగాణ బిడ్డలకే 95 శాతం రిజర్వేషన్ల కల్పించాలనే నిర్ణయంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఊగిసలాడుతుంటే తాను వెళ్లి మాట్లాడానని చెప్పారు. ‘‘చేస్తవ చస్తవా.. నరేంద్ర మోదీ, మా పంచాయతీ దీనిపైనే ఉందంటూ బల్ల గుద్ధి ఖచ్చితంగా కావాలి, ఇది మా హక్కు’’ అని తెలిపానన్నారు. దీనిపై కొత్తగా రాష్ట్రపతి నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నామని, ఇకపై మరెవ్వరూ తెలంగాణ బిడ్డల ఉద్యోగాలను తన్నుకుపోలేరని కేసీఆర్ పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.