యాప్నగరం

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి కేసీఆర్ మద్దతు!

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు ప్రకటించారు..

TNN 19 Jun 2017, 3:57 pm
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు ప్రకటించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్‌ను ఎంపిక చేసినట్లు కేసీఆర్‌కు ప్రధాని మోదీ ఫోన్ ద్వారా తెలిపారు. రామ్‌నాథ్‌కు మద్దతు ఇవ్వాలని ప్రధాని కోరగా సీఎం కేసీఆర్ అందుకు అంగీకరిస్తూ.. హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా తెలిపారు. కేసీఆర్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ.. ‘ఒక దళిత నాయకుడిని రాష్ట్రపతిగా ఎంపిక చేయాలని మీరు సూచించారు. మీ సూచన మేరకు ఎన్డీఏ అభ్యర్థిగా దళిత నేతనే ఎంపిక చేశాం. అందుకే ముందుగా మీకు ఫోన్ చేస్తున్నాను. మీ మద్దతు కోరుతున్నాను’ అని పేర్కొన్నట్లు సమాచారం. దీనికి సీఎం కేసీఆర్ వెంటనే అంగీకారం తెలిపారు. ఒక దళిత నేతకు అవకాశం వచ్చినందుకు ప్రధాని విజ్ఞప్తి మేరకు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఆయన టీఆర్‌ఎస్ నేతల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
Samayam Telugu cm kcr agrees to support nda president candidate
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి కేసీఆర్ మద్దతు!

Hon'ble PM @narendramodi Ji has telephoned Sri KCR garu seeking support for Sri Ramnath Kovind Ji as President. Our CM has agreed to support — KTR (@KTRTRS) June 19, 2017
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తమిళనాడు సీఎం పళనిస్వామి, బీహార్ సీఎం నితీష్ కుమార్‌ తదితరులకు కూడా మోదీ ఫోన్‌ చేసి ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం బీహార్‌ గవర్నర్‌గా పనిచేస్తున్న రామ్‌నాథ్.. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తిగానూ పనిచేశారు. బీజేపీలో అత్యంత ఉన్నత స్థాయికి ఎదిగిన దళిత నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. రామ్‌నాథ్‌ గతంలో ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.