యాప్నగరం

డబుల్ బెడ్‌రూం లబ్దిదారులకు సీఎం ఫోన్

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రెండుపడక గదుల (డబుల్ బెడ్ రూం) లబ్దిదారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.

Samayam Telugu 30 Mar 2017, 6:49 pm
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రెండుపడక గదుల (డబుల్ బెడ్ రూం) లబ్దిదారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ఖమ్మం జిల్లా మద్దులపల్లిలో ఉగాది (బుధవారం) పర్వదినం సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సామూహిక గృహ ప్రవేశాలు జరిగాయి.
Samayam Telugu cm kcr calls to double bedroom beneficiaries
డబుల్ బెడ్‌రూం లబ్దిదారులకు సీఎం ఫోన్


ఈ గృహ ప్రవేశాలు చేసిన వారికి కేసీఆర్ ఫోన్ చేసి సౌకర్యాలపై ఆరా తీశారు. లబ్ధిదారుల్లో ఒకరైన నాగమణి అనే మహిళకు ఫోన్ చేశారు. ఇల్లు ఎలా ఉంది? సౌకర్యాలు బాగున్నాయా? అని అడిగారు.

సీఎం ఫోన్ చేయడంతో ఉక్కిబిక్కిరైన నాగమణి.. ఇల్లు లేని తనకు ఇల్లు కేటాయించినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపింది. కేసీఆర్ రుణం తీర్చుకోలేనిదని ఆమె చెప్పింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.