యాప్నగరం

ప్రధాని కూడా ప్రశంసించారు: సీఎం కేసీఆర్

నోట్ల రద్దు లాంటి సంక్షోభాలను కూడా తట్టుకొని ఎస్‌వోఆర్‌లో 21 శాతం అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రం.. దేశంలోనే నంబర్ వన్‌గా ఉందని..

TNN 15 Mar 2017, 5:31 pm
నోట్ల రద్దు లాంటి సంక్షోభాలను కూడా తట్టుకొని ఎస్‌వోఆర్‌లో 21 శాతం అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రం.. దేశంలోనే నంబర్ వన్‌గా ఉందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చెప్పారు. ఈ విషయం చెప్పినప్పుడు ప్రధాని ప్రశంసించారని ఆయన వివరించారు. వృద్ధి విషయంలో గుజరాత్ రాష్ట్రం కంటే మనమే 10 శాతం మెరుగ్గా ఉన్నామని ఆయన వెల్లడించారు. శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు.
Samayam Telugu cm kcr explains the development of telangana
ప్రధాని కూడా ప్రశంసించారు: సీఎం కేసీఆర్


తెలంగాణలో నైపుణ్యం ఉన్న మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి అన్నారు. రైతుకు ఎలాంటి కులం ఉండదనీ, ఎవరికి భూమి ఉంటే వారు వ్యవసాయం చేస్తారని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో 90.75 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలున్నారని, వారందరూ వృద్ధిలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. యాదవులు, మత్స్యకారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.