యాప్నగరం

కరవుబారిన పడ్డ తెలంగాణను ఆదుకోండి...

ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు

TNN 10 May 2016, 4:44 pm
ఢిల్లీ : ప్రధాని మోడీతో మంగళవారం సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో నెలకొన్న కరవు పరిస్థితులను పీఎం దృష్టికి తీసుకెళ్లారు. కరవును ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి నిధులు అందించాలని ప్రధానిని కోరారు. అలాగే అసెంబ్లీ సీట్ల పెంపు, పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు విడుదల చేయాలని కోరారు. కాగా ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు.
Samayam Telugu cm kcr meet to pm modi
కరవుబారిన పడ్డ తెలంగాణను ఆదుకోండి...


ప్రధానితో భేటీ అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో సాధరణం కన్నా తక్కవవర్షం నమౌదైందని.. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కరవును ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి సహాయం అందించాలని కోరినట్లు వివరించారు. తెలంగాణలోని ఏడు జిల్లాల్లో 231 మండలాలను మాత్రమే కరవు మండాలుగా ప్రకటించారని.. వాస్తవానికి అంతకంటే ఎక్కవ మండాలలు కరవు బారినపడ్డాయని.. వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేసి మరికొన్ని మండలాలను కరవు మండాలుగా ప్రకటించాలని ప్రధానిని కోరినట్లు సీఎం కేసీఆర్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.