యాప్నగరం

దేశంలోనే నెం.1 సిఎం కేసీఆర్, ఐదో స్థానంలో బాబు !

వివిధ రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల పాలన, ప్రజా పథకాల అమలుపై విడిపి సంస్థ సర్వే

TNN 28 May 2016, 5:59 pm
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పాలన, అమలవుతున్న పథకాలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ఈ లెక్కన తెలంగాణ సిఎం కేసీఆర్ రాజకీయంగా, పాలనాపరంగా దూసుకుపోతున్నారనే చెప్పాలి. ఇటీవల విడిపి అసోసియేట్స్ అనే సంస్థ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల పాలన, ప్రజా పథకాల అమలుపై ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం తెలంగాణ సిఎం కేసీఆర్ పనితీరుకు 86% ప్రజామోదం లభించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. 81% ప్రజా మద్ధతుతో మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రెండో స్థానంలో నిలిచారు. మొన్నటి ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన బెంగాల్ సిఎం మమతా బెనర్జీకి 75% సపోర్టు ఉందని సర్వే తేల్చి మూడో స్థానంలో నిలిపింది. తమిళనాడులో అనేక ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెట్టి మరోమారు అధికారం కైవసం చేసుకున్న ’అమ్మ’ జయలలితకు 72% ప్రజల్లో మద్ధతు ఉందని నాలుగో స్థానాన్ని కట్టబెట్టారు. ఇక మన తెలుగు రాష్ట్రం నవ్యాంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటోంది. ప్రజారాజధాని అమరావతి నగరాన్ని నిర్మిస్తున్న ఏపి సిఎం చంద్రబాబుకు 69% ప్రజాదరణతో దేశంలో ఐదో స్థానంలో నిలిచారు. ఇక అవకాశం దొరికినప్పుడల్లా నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై యుద్ధ చేస్తున్న ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ కు 65% ప్రజా మద్ధతుతో ఆరో స్థానం దక్కించుకున్నారు. అలాగే పాలనలో తమదైన స్టైల్ చూపిస్తున్న రాజస్థాన్ సిఎం వసుంధరా రాజే, బిహార్ సిఎం నితీష్ కుమార్ యాదవ్, మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ తర్వాతి స్థానాలను ఆక్రమించారు. బిజేపి పాలిత రాష్ట్రాలలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులపై కంటే ప్రధాని నరేంద్ర మోదీ వల్లనే అంతో ఇంతో ప్రజాదరణ ఉంది. కాగా పంజాబ్ సిఎం ప్రకాష్ సింగ్ బాదల్, ఉత్తరప్రదేశ్ సిఎం అఖిలేష్ యాదవ్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత ఉన్నట్లు ఈ సర్వే ద్వారా వెల్లడైంది.
Samayam Telugu cm kcr no 1
దేశంలోనే నెం.1 సిఎం కేసీఆర్, ఐదో స్థానంలో బాబు !


Although 59% of Maha voters satisfied with overall performance of Devendra Fadnavis his own popularity below Modi's pic.twitter.com/uFbXZ7BfVX— VDPAssociates (@VDPAssociates) May 27, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.