యాప్నగరం

భూసేకరణ చేయని దేశాలు, రాష్ట్రాలే లేవు

మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం భూసేకరణ సేకరణ సమయంలో సంబంధం లేని వ్యక్తులు, నేతలు రైతులను రెచ్చగొడితే

Samayam Telugu 28 Dec 2016, 4:08 pm
మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం భూసేకరణ సేకరణ సమయంలో సంబంధం లేని వ్యక్తులు, నేతలు రైతులను రెచ్చగొడితే తానే లాఠీ ఛార్జీ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సీపీఎం పార్టీకీ ప్రజల ప్రాణాలంటే లెక్కే లేదని, భూసేకరణ విషయంలో ఆపార్టీ బయటి ప్రాంతాల నుంచి జనాన్ని తరలించి శాంతి భద్రతలకు విఘాతం కల్గించినందుకే తాను పోలీసులను అప్రమత్తంగా ఉండాలని చెప్పానని కేసీఆర్ అసెంబ్లీలో తెలిపారు. భూసేకరణ చేపట్టని దేశాలు, రాష్ట్రాలే లేవని ఆయన గుర్తు చేశారు.
Samayam Telugu cm kcr says land acquisition is for development of telangana
భూసేకరణ చేయని దేశాలు, రాష్ట్రాలే లేవు


భూసేకరణ సవరణ బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో కేసీఆర్ పాల్గొన్నారు.
సీపీఎం ఓ సూది పార్టీ అని ఆయన మండిపడ్డారు. మరో ముదిగొండ చేయాలనేది వారిలక్ష్యమని దుయ్యబట్టారు. కొన్ని పార్టీలు..సూది పార్టీ, దబ్బనం పార్టీలని ఎద్దేవా చేసిన కేసీఆర్..ఎంతసేపు ప్రభుత్వాలను పొడవడమే వాటి పని ఆయన విమర్శించారు.
సీపీఎంది దిక్కుమాలిన స్ట్రాటజీ అని ఆయన ఫైర్ అయ్యారు.

నిజాం పరిపాలనలో తమ కుటుంబానికి చెందిన ఎన్నో ఎకరాలు భూసేకరణలో నష్టపోయామని...అప్పుడు ఎంతో బాధపడ్డామని...ఇప్పుడు రైతులు భూములు కోల్పోతే తానే అధికంగా బాధపడతానని కేసీఆర్ అన్నారు.

2013 భూసేకరణ చట్టంలో లేని అంశాలు రైతుల ప్రయోజనాల కోసం తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కేసీఆర్ గుర్తు చేశారు. పునరావాస చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

‘భూములు ఉన్నవారికో అదో పిచ్చి ఉంటుంది. భూమి అలా పడి ఉంటుందని అందరికీ ఉంటుంది. మాకు కూడా కొంత భూమి ఉంది. నా కుటుంబ సభ్యులకు చెందిన భూములు కూడా కోల్పోయారు.
భూములు కోల్పోయిన వారికి పదివంతుల నష్టపరిహారం చెల్లించామని ఆయన గుర్తు చేశారు. భూములు కోల్పోయిన రైతులు డబుల్ బెడ్ రూం పథకంలో ఇల్లు కట్టిస్తామని పేర్కొన్నారు. భూ నిర్వాసితులకు నష్టం కల్గకుండా ఆర్థిక సాయం చేయడమ తప్పా అని ఆయన ప్రతిపక్షాలను ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.