యాప్నగరం

అధికారులూ అదరగొట్టారు.. పలువురి ప్రశంస

ప్రతిష్టాత్మక ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు, మెట్రో రైల్ ప్రారంభోత్సవం కార్యక్రమాలు విజయవంతమవడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వివిధ శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేసి తెలంగాణ ప్రతిష్టను నిలబెట్టారని ఆయన కొనియాడారు.

TNN 30 Nov 2017, 7:38 pm
ప్రతిష్టాత్మక ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు, మెట్రో రైల్ ప్రారంభోత్సవం కార్యక్రమాలు విజయవంతమవడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వివిధ శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేసి తెలంగాణ ప్రతిష్టను నిలబెట్టారని ఆయన కొనియాడారు. జీఈఎస్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ప్రతిష్ట మరింత పెరిగిందని కేసీఆర్ చెప్పారు. గురువారం (నవంబర్ 30) జీఈఎస్ ముగింపు నేపథ్యంలో.. ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమాలను దిగ్విజయం చేశారని, దేశ విదేశాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తల గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారని అధికారులను ప్రశంసించారు. తెలంగాణ పోలీస్ శాఖ అత్యున్నత ప్రమాణాలతో, అత్యంత హుందాగా పనిచేసిందని కితాబిచ్చారు.
Samayam Telugu cm kcr showers praise on hyderabad police after ges success
అధికారులూ అదరగొట్టారు.. పలువురి ప్రశంస


పోలీసుల పనితీరును ప్రశంసిస్తూ కేంద్రం నుంచి సందేశం వచ్చిందని కేసీఆర్ తెలిపారు. అనేక మంది ప్రముఖులకు అసాధారణ రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారని కేంద్రం ప్రశంసించినట్లు చెప్పారు. పోలీసులు టీం స్పిరిట్‌తో పనిచేశారని, సమర్థంగా విధులు నిర్వర్తించారని సీఎం పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళిక, వ్యూహం ప్రకారం పనిచేయడంతో ఎక్కడా చిన్న అవాంతరం తలెత్తలేదని ఆయన అన్నారు.

అందరినీ సమన్వయం చేస్తూ అతిపెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్‌ రెడ్డితో పాటు అధికార యంత్రాంగానికి సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. రాష్ట్ర పోలీసులను అమెరికా సీక్రెట్ ఏజెన్సీ, కేంద్ర హోంశాఖ, నీతి ఆయోగ్, వివిధ దేశాల ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు లభించడం గమనార్హం. ముఖ్యంగా ఇవాంక భద్రత కోసం విధులు నిర్వహించిన మహిళా పోలీసు ఉన్నతాధికారులకు మంచి ప్రతిస్పందన లభించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.