యాప్నగరం

ప్రభుత్వం రాసిచ్చిందే గవర్నర్ చదువుతారు: కేసీఆర్

అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగం అక్షర సత్యమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కొంత మంది పని గట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, సభ్యులు అడ్డగోలుగా మాట్లాడటం సరికాదని ఆయన సూచించారు.

Samayam Telugu 14 Mar 2018, 4:28 pm
అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగం అక్షర సత్యమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కొంత మంది పని గట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, సభ్యులు అడ్డగోలుగా మాట్లాడటం సరికాదని ఆయన సూచించారు. బుధవారం (మార్చి 14) అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు.
Samayam Telugu cm kcr speech in telangana assembly
ప్రభుత్వం రాసిచ్చిందే గవర్నర్ చదువుతారు: కేసీఆర్


‘గవర్నర్ ప్రసంగం విషయంలో ప్రతిపక్ష సభ్యులు అనేక వ్యాఖ్యలు చేశారు. సభ్యులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి అతీతంగా ఉండే వ్యక్తి కాదు. రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిందే చదవాలి. గవర్నర్ స్పీచ్‌కు కేబినెట్ ఆమోదం తెలపాలి. ప్రభుత్వం రాసిచ్చిందే ఆయన చదువుతారు. ప్రభుత్వంలో జరిగే సత్యాలనే గవర్నర్ చదవి వినిపించారు’ అని కేసీఆర్ అన్నారు.

శాసనసభలో జరిగే సంఘటనలు బాధ కలిగిస్తున్నాయని కేసీఆర్ తెలిపారు. అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఆయన స్పష్టం చేశారు. ‘ఇప్పటికే ఇద్దరి శాసనసభ్యత్వాలు రద్దు చేశాం. మరో ఇద్దరివి రద్దు చేసే యోచనలో ఉన్నాం’ అని సీఎం హెచ్చరించారు.

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభ ఆమోదించిన అనంతరం శాసన సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. గురువారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్‌-2018ను ప్రవేశపెట్టనున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపనుంది.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.