యాప్నగరం

పాలన సరిగా లేకపోతే జనం ఓట్లేయరు: కేసీఆర్

విపక్షాలు విమర్శలు మాని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి సహకరించాలని కేసీఆర్‌ కోరారు.

TNN 17 Mar 2017, 5:48 pm
రాష్ట్రంలో అన్ని జిల్లాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం రూ. 600 కోట్లు కేటాయించామని ఆయన తెలిపారు. జిల్లాలను కుదించే ప్రసక్తేలేదని సీఎం స్పష్టం చేశారు. హాస్టల్ (వసతి గృహాలు) విద్యార్థులకు మెస్‌ఛార్జీలకు సరిపడా నిధులు పెంచుతామని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం వేశామని వెల్లడించారు.
Samayam Telugu cm kcr talks in telangana assembly
పాలన సరిగా లేకపోతే జనం ఓట్లేయరు: కేసీఆర్


బడ్జెట్‌ను చూసి కులవృత్తుల వారు సంబురాలు చేసుకుంటున్నారని, యాదవులు, కుర్మలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. రాబోయే అవసరాలను దృష్టిలో ఉంచుకొని.. ప్రజలు, పరిశ్రమలు, రైతులకు నిరంతర సరఫరా కోసం.. విద్యుత్‌ కొనుగోలు చేశామని చెప్పారు. గొర్రెల పంపిణీ పథకం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని, కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ పథకానికి రాష్ట్రమే పూర్తి నిధులు భరిస్తుందని సీఎం తెలిపారు.

విపక్షాలు విమర్శలు మాని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి సహకరించాలని కేసీఆర్‌ కోరారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని, అప్పుడే ఎందుకు తొందరపడుతున్నారంటూ ఆయన ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ప్రజలు తెలివిగా ఆలోచిస్తున్నారని.. పాలన సరిగా లేకపోతే ఓటేయరని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం.. అప్పులు చేయడం, తీర్చడం అనేది నిరంతర ప్రక్రియ అని ఆయన అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.