యాప్నగరం

వాళ్లిద్దరినీ జాగ్రత్తగా ఉండాలంటూ సూచించిన కేసీఆర్‌

హోంమంత్రి నాయినీ నర్సింహారెడ్డి, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలని.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

TNN 29 Mar 2017, 6:56 pm
హోంమంత్రి నాయినీ నర్సింహారెడ్డి, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలని.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వాళ్ల పనితీరు బాగా లేదనో.. లేకపోతే.. వాళ్లకేదో ఆపద రాబోతుందనో.. సీఎం ఈ వ్యాఖ్యలు చేయలేదు. అసలు విషయం ఏమీటంటే.. ఇవాళ ప్రగతి భవన్‌లో ఉగాది వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శృంగేరి పీఠానికి చెందిన బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. కొత్త ఏడాదిలో రాష్ట్ర స్థితిగతుల గురించి బెబుతూ.. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఆ తర్వాత ప్రసంగించిన ముఖ్యమంత్రి ఈ అంశం గురించి ప్రస్తావిస్తూ.. పంచాంగం ప్రకారం.. హోం మంత్రి, పోలీస్ కమిషనర్ జాగ్రత్తగా ఉండాలని చమత్కరించారు.
Samayam Telugu cm kcr talks in ugadi celebrations at pragati bhavan
వాళ్లిద్దరినీ జాగ్రత్తగా ఉండాలంటూ సూచించిన కేసీఆర్‌


పోలీస్ బాస్, సంబంధిత శాఖా మంత్రి.. అప్రమత్తంగా ఉంటేనే ప్రజలందరూ సురక్షితంగా, ఆనందోత్సాహాలతో ఉంటారని ముఖ్యమంత్రి ఉద్దేశం అన్నమాట. కేసీఆర్ మాట్లాడుతూ.. కొత్త ఏడాది అద్భుత ఫలితాలు ఇస్తుందని.. మూడొంతులు శుభాధిపత్యమే ఉంటుందని పండితులు చెప్పారన్నారు. ఈసారి వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండుతాయన్నారు. ఏటా రాష్ట్ర ఆదాయం రూ. 20 వేల కోట్ల వరకు పెరుగుతోందని, తెలంగాణ రాష్ట్రం అందరి మన్ననలు అందుకుంటోందని సంతోషం వ్యక్తం చేశారు. పాత అధికారులే అయినా అద్భుతంగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. తెలంగాణపై దేవుడి కృప బాగా ఉందని, సంక్షేమ పథకాల అమల్లో రాష్ట్రం.. దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ప్రశంసించారని ఆయన తెలిపారు. ఉద్యమాలకు నాయకత్వం వహించి.. ఆ తర్వాత అధికారాన్ని చేపట్టిన విన్‌స్టన్ చర్చిల్ లాంటి మహా నేతలే పాలన విషయంలో విఫలమయ్యారని, మీరు మాత్రం చాలా విజయవంతంగా పరిపాలిస్తున్నారని అరుణ్ జైట్లీ పొగిడినట్లు కేసీఆర్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.