యాప్నగరం

కేరళ: అనంతపద్మనాభ స్వామి సన్నిధిలో కేసీఆర్

కేరళ పర్యటనకు విచ్చేసిన సీఎం కేసీఆర్.. తిరువనంతపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్‌తో ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చిస్తున్నారు.

Samayam Telugu 6 May 2019, 9:14 pm
కేరళ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు. సోమవారం (మే 6) తిరువనంతపురం విమానాశ్రయం చేరుకున్న కేసీఆర్... అక్కడ నుంచి ఆలయానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయ వస్త్రధారణలో స్వామివారిని కేసీఆర్‌ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు కేసీఆర్‌కు సాదర స్వాగతం పలికారు. అనంతపద్మనాభ స్వామి ఆలయ అధికారులు కేసీఆర్‌కు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
Samayam Telugu kerala
అనంత పద్మనాభ స్వామి ఆలయం


దేశంలో గుణాత్మక మార్పు కోసం ప్రయత్నిస్తున్న కేసీఆర్.. ఫెడరల్‌ ఫ్రంట్‌ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్రాల పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా తిరువనంతపురానికి వెళ్లిన కేసీఆర్‌.. కేరళ సీఎం పినరయి విజయన్‌తో సమావేశమయ్యారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు.

కేసీఆర్‌కు స్వాగతం


కేరళ పర్యటన అనంతరం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ కేసీఆర్ పర్యటించనున్నారు. ఆయా రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నారు. డీఎంకే అధినేత స్టాలిన్, కర్ణాటక సీఎం కుమారస్వామితో ప్రత్యేకంగా సమావేశమై ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

తిరువనంతపురం విమానాశ్రయంలో సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం లభించింది. తెలుగు సంఘాల ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.