యాప్నగరం

కేసీఆర్‌కు స్వాగతం పలికిన పోలీసు జాగిలం

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు శుక్రవారం ఒక అనుకోని అతిథి ఎదురయ్యారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో ఎస్సై

Samayam Telugu 19 May 2017, 4:01 pm
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు శుక్రవారం ఒక అనుకోని అతిథి ఎదురయ్యారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో ఎస్సై స్థాయి నుంచి డీజీపీ స్థాయి పోలీసు అధికారులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పోలీసులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సీఎం తిలకించారు. ఈ సందర్భంగా పోలీసు జాగిలం ఒకటి కేసీఆర్ కు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికింది. ఇతర జాగిలాలు సీఎంకు సెల్యూట్ చేశాయి.
Samayam Telugu cm kcr welcomed by a police dog with flower bouquet
కేసీఆర్‌కు స్వాగతం పలికిన పోలీసు జాగిలం


బాంబ్ స్వ్కాడ్ పనితీరు, సెర్చ్ అండ్ డిటెన్షన్, ప్రొటెక్షన్ అండ్ డిస్పోజబుల్ పరికరాల పనితీరును సీఎం పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

షీ టీం పనితీరుపై అధికారులు కేసీఆర్ కు వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.