యాప్నగరం

నటుడు పొట్టి రమేష్ భార్య ఆత్మహత్య

బుల్లితెర కామెడీ షోలలో మెరిసిన హాస్య నటుడు పొట్టి రమేష్.

TNN 20 Dec 2016, 1:43 pm
బుల్లితెర కామెడీ షోలలో మెరిసిన హాస్య నటుడు పొట్టి రమేష్. ఇతనికి గతేడాది వివాహమైంది. భార్య త్రిపురాంబికది నెల్లూరు. విశాఖపట్నంలోని గాజువాక ఏరియాలోని శ్రీనగర్‌లో వీరు నివాసం ఉంటున్నారు. రమేష్ తల్లిదండ్రులు కూడా వీరితో కలిసే నివసిస్తున్నారు. కాగా మూడు రోజుల క్రితం రమేష్ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చాడు. సోమవారం సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో త్రిపురాంబిక తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. రాత్రి భోజనం సమయానికి కూడా ఆమె బయటికి రాకపోవడంతో అత్తామామలకు అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలికెళ్లి చూశారు. అప్పటికే త్రిపురాంబిక ఫ్యానుకు ఉరివేసుకుంది. స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
Samayam Telugu comedian potti ramesh wife commits suicide in visakhapatnam
నటుడు పొట్టి రమేష్ భార్య ఆత్మహత్య


గదిలో సూసైడ్ నోట్ కోసం పోలీసులు వెతికారు. కానీ దొరకలేదని సమాచారం. మృతురాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ అత్తామామ, ఆడపడుచుల వేధింపులు తట్టుకోలేక తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. కనీసం వారున్నప్పుడు తమతో మాట్లాడేందుకు కూతురు భయపడేదని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.