యాప్నగరం

అడుగడునా అధికార దుర్వినియోగం.. ప్రగతి నివేదనపై ప్రతిపక్షాల విమర్శలు

ప్రగతి నివేదన సభపై విరుచుకుపడ్డాయి ప్రతిపక్షాలు. సభ పేరుతో అధికార దుర్వినియోగం జరుగుతోందంటూ టార్గెట్ చేశాయి.

Samayam Telugu 2 Sep 2018, 4:16 pm
ప్రగతి నివేదన సభ పేరుతో నాలుగేళ్ల ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజల ముందు ఉంచేందుకు సిద్ధమవుతోంది టీఆర్ఎస్ సర్కార్. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు 25లక్షలమంది తరలివస్తారని గులాబీ పార్టీ అంచనా వేస్తోంది. ఇటు టీఆర్ఎస్ పార్టీ నేతలు, కేడర్ మొత్తం ప్రగతి నివేదన సభ జోష్‌లో ఉంటే.. సభ పేరుతో తెలంగాణలో అధికార దుర్వినియోగం జరుగుతోందంటూ విపక్షాలు టార్గెట్ చేశాయి. కేసీఆర్ టార్గెట్‌గా విరుచుకుపడ్డారు ప్రతిపక్ష పార్టీల నేతలు.
Samayam Telugu ప్రగతి.


చట్టాన్ని ఉల్లంఘించాలని సీఎం కేసీఆరే స్వయంగా చెబుతున్నారంటూ ఫైరయ్యారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన.. టీఆర్ఎస్ సర్కార్ తీరుపై మండిపడ్డారు. ప్రగతి నివేదన సభ పేరుతో అడుగడునా అధికార దుర్వినియోగం జరుగుతోందన్నారు రేవంత్. రాజకీయ పార్టీలుగా సమావేశాలు, సభలు పెట్టుకోవడంలో ఎలాంటి తప్పులేదని.. ట్రాక్టర్లపై ప్రజా రవాణా నేరమన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. సభకు వచ్చే వాహనాలకు మినహాయింపు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సభకు 25లక్షలమంది వస్తారని నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని.. ఈ సభకు అయ్యే ఖర్చును ఎలా సేకరించారో చెప్పాలన్నారు రేవంత్.

ప్రగతి నివేదన సభ పేరుతో టీఆర్ఎస్ ఎన్నికల సభ నిర్వహిస్తోందన్నారు తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్. ముందస్తు ఎన్నికల పేరుతోనే.. వందలకోట్లు ఖర్చు చేసి సభను నిర్వహిస్తున్నారని.. అంత ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందన్నారు. ప్రగతి నివేదన సభ పేరుతో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం పాల్పడుతున్నారని విమర్శించారు. అలాగే ముందస్తు ఎన్నికలొచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు లక్ష్మణ్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.