యాప్నగరం

మంత్రి కేటీఆర్‌కి 'అర్జున్ రెడ్డి' హీరో బంధువట!

అర్జున్ రెడ్డి సినిమాలో తీవ్ర అభ్యంతరకరమైన అంశాలు చాలా వున్నాయని, వెంటనే ఆ సినిమా ప్రదర్శనని నిలిపివేయాలని...

TNN 29 Aug 2017, 4:11 pm
అర్జున్ రెడ్డి సినిమాలో తీవ్ర అభ్యంతరకరమైన అంశాలు చాలా వున్నాయని, వెంటనే ఆ సినిమా ప్రదర్శనని నిలిపివేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హన్మంత రావు. అర్జున్ రెడ్డి సినిమాలో హీరో మద్యం సేవించి రోగికి చికిత్స చేశానని గొప్పగా చెప్పిన దృశ్యాలు వున్నాయి. అటువంటి దృశ్యాలు నిజ జీవితంలో వైద్య వృత్తిలో వున్న వారిపై దుష్ప్రభావం చూపించే ప్రమాదం లేకపోలేదు. అలాగే యువత డ్రగ్స్‌కి అలవాటు పడటం, పెళ్లి కాకుండానే ఓ అమ్మాయిని తల్లిని చేయడం వంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు ఎన్నో వున్నాయి.
Samayam Telugu congress leader vh demands to stop screening arjun reddy film
మంత్రి కేటీఆర్‌కి 'అర్జున్ రెడ్డి' హీరో బంధువట!


అర్జున్ రెడ్డి సినిమాలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ మంత్రి కేటీఆర్‌కి బంధువైనందుకే మంత్రి గారు ఆ సినిమాను ప్రోత్సహిస్తున్నారు. ఇటువంటి సినిమాలని ప్రోత్సహించడం ద్వారా మంత్రి కేటీఆర్ యువతకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు అని విస్మయం వ్యక్తంచేశారు వీహెచ్.

ఇదిలావుంటే, అర్జున్ రెడ్డి సినిమా రేపిన వివాదం సంగతి ఎలా వున్నా.. గత వారం విడుదలైన అర్జున్ రెడ్డి సినిమా మాత్రం బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతోంది. రిలీజైన మొదటి వీకెండ్‌లోనే మిలియన్ డాలర్స్ కలెక్షన్స్‌ సాధింటిన సినిమాగా రికార్డ్ సొంతం చేసుకుంది ఈ సినిమా.
Raw. Intense. Honest. Original. Bold. Gutsy. Risqué#ArjunReddyKudos to Sandeep Reddy & Pranay👍Vijay Devarakonda you're a Rockstar🤘— KTR (@KTRTRS) August 27, 2017
గతంలో చాలా సినిమా హీరోలు, దర్శకులని అభినందించిన మంత్రి కేటీఆర్ ఎప్పటిలాగే ఈ సినిమాను చూసిన తర్వాత ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. సినిమా చాలా బోల్డ్‌గా వుందని కితాబిచ్చారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి, నిర్మాత ప్రణయ్‌లని అభినందించిన కేటీఆర్.. నటుడు విజయ్ దేవరకొండని రాక్ స్టార్ అని ప్రశంసించారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ తీరుని విమర్శిస్తూ ఈరోజు మీడియాతో మాట్లాడిన వీహెచ్.. అర్జున్ రెడ్డి సినిమా ప్రదర్శనని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.