యాప్నగరం

‘500 కోట్లు ఖర్చుపెట్టినా కేసీఆర్ అక్కడ గెలవలేరు’

ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగానే తెలంగాణలో అప్పుడే రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ నిన్న కేటీఆర్‌కు సవాల్ విసిరితే, తాజాగా కోమటిరెడ్డి కేసీఆర్‌కు సవాల్ విసిరారు.

TNN 9 Nov 2017, 3:34 pm
నల్గొండ నియోజకవర్గం నుంచి కేసీఆర్‌ పోటీ చేయాలని, రూ.500 కోట్లు ఖర్చుచేసినా కూడా ఆయన గెలవలేరని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ వందల కోట్లు ఖర్చుచేసినా విజయం మాత్రం తనదేనని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ లాబీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ నల్గొండ నుంచి పోటీ చేయాలి లేకపోతే తానే గజ్వేల్‌లో ఆయనపై పోటీ చేస్తానని అన్నారు. 50 వేల మెజార్టీతో కనుక తాను గెలవకుంటే.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని శపథం చేశారు. అలాగే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ప్రభుత్వాన్ని అక్బరుద్దీన్ పొగిడిన విషయం తమకు అవసరం లేదని, ఆయన నరం లేని నాలుకలాంటి వారని అన్నారు. ఎవరు అధికారంలో ఉంటే వారినే ఆయన పొగుడుతారని, గతంలో కాంగ్రెస్ పార్టీని కూడా పొగిడారని ఎద్దేవా చేశారు.
Samayam Telugu congress mla komatireddy venkatareddy open challenge to kcr
‘500 కోట్లు ఖర్చుపెట్టినా కేసీఆర్ అక్కడ గెలవలేరు’


2019 అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తాను గెలవలేకపోతే, తెలంగాణలో తలెత్తుకుని తిరగలేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లోనూ తాను ఎమ్మెల్యేగా మాత్రమే పోటీ చేస్తానని, ఎంపీగా పోటీ చేసి ఢిల్లీకి వెళ్లే ఉద్దేశం లేదని చెప్పారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన కంచర్ల భూపాల్ రెడ్డికి తనను ఓడించేంత సీన్ లేదని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.