యాప్నగరం

‘అక్కడ ఈ డూప్లికేట్ తారకరామారావు ఎంత’

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆరే కల్వకుర్తి నుంచి పోటీ చేసి ఓడిపోయారని ఈ కేటీఆర్ ఒక లెక్కా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

TNN 8 Nov 2017, 12:08 pm
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆరే కల్వకుర్తి నుంచి పోటీ చేసి ఓడిపోయారని... ఈ డూప్లికేట్ తారకరామారావు మా నియోజకవర్గ ప్రజలకు ఒక లెక్కా అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, కల్వకుర్తికి చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్‌లో చేరారని... వారు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మీ తండ్రి కేసీఆర్ చెప్పారని, ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారని... అవన్నీ ఏమయ్యాయో చెప్పాలంటూ కేటీఆర్‌ను నిలదీశారు.
Samayam Telugu congress mla vamshi chand reddy fires on telangana minister ktr
‘అక్కడ ఈ డూప్లికేట్ తారకరామారావు ఎంత’


ఫార్మా సిటీ పేరుతో మీరు, మీ కుటుంబ సభ్యులు అక్రమంగా భూములను లాక్కున్నారని... అందుకే తాము దీన్ని అడ్డుకుంటామని వంశీచంద్ హెచ్చరించారు. అంతేకాదు తమరి నియోజకవర్గం సిరిసిల్లలో కూడా అక్రమంగా భూసేకరణ చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. మరోవైపు వరి పంటలను ఎవరూ తగలబెట్టడం లేదని, కాంగ్రెస్ పార్టీకి చెందినవారే తగలబెడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలే ఒక ముఠాను తయారుచేసి, వారితో పంటలను తగలబెట్టించి, ఫొటోలు తీయించి పేపర్లలో వేయిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఖమ్మంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తల ముఠానే ఇలాంటి చర్యలకు పాల్పడిందని కేసీఆర్ దుయ్యబట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.