యాప్నగరం

సుప్రీంకు కోమటిరెడ్డి, సంపత్!

హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌లపై అసెంబ్లీ నుంచి బహిష్కరణ వేటు పడింది.

Samayam Telugu 24 Aug 2018, 10:03 am
హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌లపై అసెంబ్లీ నుంచి బహిష్కరణ వేటు పడింది. దీనిపై వారిద్దరు హైకోర్టును ఆశ్రయించగా, అసెంబ్లీ సభ్యత్వాలను పునరిద్ధరిస్తూ సింగిల్ జడ్జి ఆదేశాలిచ్చారు. రాష్ట్ర అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు వేరువేరుగా దాఖలు చేసిన అప్పీళ్లను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. సింగిల్ జడ్జి ఆదేశాలను ధర్మాసనం రెండు నెలల పాటు సస్పెండ్ చేసింది.
Samayam Telugu Supremecourt


దీనిపై రాష్ట్ర అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు వేర్వేరుగా దాఖలు చేసిన అప్పీళ్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. సింగిల్‌ జడ్జి ఆదేశాలను ధర్మాసనం రెండు నెలలపాటు సస్పెండ్‌ చేసింది. అంతేకాకుండా సింగిల్‌ జడ్జి ఆదేశాలపై దాఖలైన కోర్టు ధిక్కార వ్యాజ్యం తదుపరి విచారణ ప్రక్రియను నిలుపుదల చేస్తూ మంగళవారం (ఆగస్టు 21) ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.