యాప్నగరం

కేసీఆర్‌ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ.. టీఆర్ఎస్‌లో చేరతారా?

ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసి ఆకుల లలిత. ఎమ్మెల్సీ వెంట నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు. ఆకుల లలిత టీఆర్ఎస్‌లో చేరడం లాంఛనమేనా?

Samayam Telugu 20 Dec 2018, 10:34 pm

ప్రధానాంశాలు:

  • కేసీఆర్‌కు అభినందనలు తెలిపేందుకే కలిశారట
  • టీఆర్ఎస్‌లో చేరడం ఖాయమంటూ ప్రచారం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu mlc akula
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభంకాబోతుందా. త్వరలోనే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వలసలు మొదలుకాబోతున్నాయా. హస్తం పార్టీ ముఖ్య నేతలు.. కారెక్కేందుకు సిద్ధంగా ఉన్నారా. కొద్ది రోజులుగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్‌లో మొదలైన చర్చ ఇది. ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తూ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేత, ఎమ్మెల్సీ ఆకుల లలిత.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలవడం చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆకుల లలిత గురువారం రాత్రి ప్రగతి భవన్‌కు వెళ్లారు. సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు.. దాదాపు గంటకుపైగా భేటీ కొనసాగినట్లు తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్‌ మరోసారి అధికారంలోకి వచ్చిన సందర్భంగా కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపినట్లు లలిత అనుచరులు చెబుతున్నారు. కాని కాంగ్రెస్‌లో ముఖ్య నేతగా ఉన్న లలిత గులాబీ బాస్‌ను కలవడంతో.. టీఆర్ఎస్‌లో చేరడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీనిపై ఆకుల లలిత స్పందచాల్సి ఉంది.

ఆకుల లలిత ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చేతిలో 28,795 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.