యాప్నగరం

తెలంగాణ ఎన్నికలకు ఏపీ పోలీసులు!

తమవైపు నుంచి ఎలాంటి అభ్యంతరం లేనందున.. తెలంగాణ ఈసీ రాసిన లేఖ ఆధారంగా కేంద్ర హోంశాఖ, ఈసీకి అదే విషయాన్ని ఏపీ పోలీసు శాఖ స్పష్టం చేయబోతున్నట్లు తెలిసింది.

Samayam Telugu 4 Nov 2018, 10:23 am
తెలంగాణలో డిసెంబరు 7న జరిగే ఎన్నికలకు ఏపీ నుంచి పోలీసు బలగాలు పంపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, సీఈసీ ఏపీని కోరాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పోలీసుశాఖకు లేఖ రాశారు. తెలంగాణ ఎన్నికలకు ఏపీ పోలీసులు వద్దంటూ ఇప్పటికే రాష్ట్ర ఈసీ రజత్ కుమార్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. తమవైపు నుంచి ఎలాంటి అభ్యంతరం లేనందున.. తెలంగాణ ఈసీ రాసిన లేఖ ఆధారంగా కేంద్ర హోంశాఖ, ఈసీకి అదే విషయాన్ని ఏపీ పోలీసు శాఖ స్పష్టం చేయబోతున్నట్లు తెలిసింది.
Samayam Telugu AP Police


తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితంచేసే అవకాశమున్నందున బందోబస్తు ఏర్పాట్లకు ఏపీ పోలీసులు, హోంగార్డులను తీసుకోవడంలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ 5 రోజుల క్రితం స్పష్టంచేసిన సంగతి తెలిసిందే... ఏపీ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇటీవల తెలంగాణలో డబ్బులు పంచుతున్నాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 70 వేల మంది రాష్ట్ర పోలీసులతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిషా నుంచి బలగాలను రప్పిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ తెలిపారు. అయితే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, సీఈసీ మాత్రం పోలీసు బలగాలను పంపాలని ఏపీ పోలీసులకు లేఖ రాశారు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.