యాప్నగరం

ఘట్కేసర్: ప్రేమ పెళ్లి చేసుకున్న 10 రోజులకే ఉరికి వేలాడుతూ..

హైదరాబాద్ నగర శివార్లలోని అన్నోజి గూడలో విషాద చోటుచేసుకుంది. పది రోజుల కిందటే ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

Samayam Telugu 26 Jan 2019, 4:05 pm
టీవలే ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతులు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. హైదరాబాద్ నగర శివార్లలో ఘట్కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అన్నోజి గూడలో చోటుచేసుకున్న ఈ విషాదం శనివారం (జనవరి 26) ఉదయం వెలుగులోకి వచ్చింది. ఓల్డ్‌ అల్వాల్‌కు చెందిన మల్లేష్‌ (26) అనే యువకుడు 10 రోజుల కిందట అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం. నవ దంపలిద్దరూ అన్నోజి గూడలోని రాజీవ్‌ గృహకల్పలో బ్లాక్‌ నెంబర్‌ 78లో నివాసం ఉంటున్నారు.
Samayam Telugu suicide


శనివారం ఉదయం వారు నివాసం ఉంటున్న గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గమనించగా.. నవ దంపతులిద్దరూ గదిలో ఉరి వేసుకొని విగతజీవులుగా కనిపించారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మూడు రోజుల కిందటే వారు ఇక్కడకు వచ్చి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మల్లేష్.. ఓల్డ్‌ అల్వాల్‌లోని చిన్నన్నతోటకు చెందినవాడు. అతడి ఆకస్మిక మృతితో అక్కడ విషాదం చోటుచేసుకుంది. నవ దంపతుల మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.