యాప్నగరం

వెనక్కు తగ్గేది లేదు.. ఇక సమరమే: పవన్

ఏపీక ప్రత్యేక హోదా కోసం ఇక సమరమే అంటున్నారు జనసేనాని. కామ్రేడ్‌లతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. సీపీఎం, సీపీఐ నేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్... భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

Samayam Telugu 26 Mar 2018, 3:44 pm
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఇక సమరమే అంటున్నారు జనసేనాని. కామ్రేడ్‌లతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. సీపీఎం, సీపీఐ నేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్... భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రత్యేక హోదా లేకపోవడం వల్లే ఏపీ చాలా నష్టపోతుందన్నారు పవన్. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. ఇన్నాళ్లూ పనిచేయని వారు ఇప్పుడు పనిచేస్తారన్న గ్యారెంటీ లేదని... అందుకే బీజేపీ, టీడీపీలపై నమ్మకం పోయిందన్నారు. అధికార పార్టీని జనసేనాని మరోసారి టార్గెట్ చేశారు. రాజధాని నిర్మాణం టీడీపీ అనుబంధ వ్యక్తులది మారిందని విమర్శించారు. పుష్కరాలకు ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చు చేశారని మండిపడ్డారు. చట్టాలకు ఎవరూ అతీతులు కారని గమనిస్తే మంచిదన్నారు.
Samayam Telugu Pawan Kalyan1


అమిత్ షా రాసిన లేఖపైనా స్పందించారు పవన్. కేంద్రం నుంచి లేఖ వస్తే స్పందిస్తాం కాని... ఓ పార్టీ అధ్యక్షుడి హోదాలో రాసిన ఆ లేఖను అసలు పరిగణలోకి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలే కేంద్రంగా హోదా ఉద్యమాన్ని నిర్మించాలని తీర్మానించారు. అలాగే విద్యార్థి సంఘాలతో కలిసి భారీ ఎత్తున ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్రం హోదాతో పాటూ విభజన హామీల్ని నెరవేర్చే వరకూ ఒత్తిడి చేసేలా ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాల వారీగా కూడా సమావేశాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.