యాప్నగరం

రైతులకు ప్లాట్లను కేటాయించిన సీఆర్డీఏ

అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఏపీ సీఆర్డీఏ ప్లాట్ల పంపిణీని ప్రారంభించింది.

TNN 3 Jan 2017, 3:55 pm
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఏపీ సీఆర్డీఏ ప్లాట్ల పంపిణీని శరవేగంగా చేస్తోంది. గుంటూరు జిల్లా తుళ్లూరులో సీఆర్డీఏ కార్యాలయం ఆవరణలో రైతులకు ప్లాట్ల ఎంపిక కార్యక్రమాన్ని పూర్తిచేసింది. ప్లాట్లను ఆన్ లైన్ లాటరీ విధానంలో ఎంపిక చేశారు. 1834 నివాస సముదాయ ప్లాట్లు, 1265 వాణిజ్య సముదాయ ప్లాట్లను రైతులకు కేటాయించారు. సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పూర్తి చేశారు.
Samayam Telugu crda allotted plots to farmers who gave land for amaravati
రైతులకు ప్లాట్లను కేటాయించిన సీఆర్డీఏ


నవ్యాంధ్ర రాజధాని అమరావతిని నిర్మించేందుకు వందల మంది రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి తమ భూముల్నిచ్చారు. వారి భూముల్ని తీసుకున్న ప్రభుత్వం ఆ చుట్టుపక్కలే వారికి నివాస సముదాయాలకు, వాణిజ్య సముదాయాలకు ప్లాట్లను కేటాయించి వారికి అందించింది. పంపిణీ కార్యక్రమమంతా ప్రశాంతంగా ముగిసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.